Telugu Flash News

Uday Kiran: ఉదయ్ కిర‌ణ్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో త‌న‌కు తెలుసంటూ తేజ సంచ‌ల‌న కామెంట్స్

teja comments on uday kiran death

Uday Kiran: సినిమా ప‌రిశ్ర‌మలో ఓ వెలుగు వెలిగిన న‌టుడు ఉద‌య్ కిర‌ణ్‌.ఎలాంటి స‌పోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఆన‌తి కాలంలో స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే చిన్న వ‌య‌స్సులోనే ఊహించ‌ని విధంగా ఉద‌య్ కిర‌ణ్ మృతి చెంద‌డం అంద‌రిని క‌ల‌వ‌ర‌ప‌ర‌చింది. ఉదయ్ కిరణ్ ఈ ఘోరానికి ఎందుకు పాల్పడ్డారు? ఆయన మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అనేది ఇప్ప‌టికీ స‌స్పెన్స్‌గానే ఉంది.

ఆయ‌న మృతిపై ప‌లువురు ప‌లు ర‌కాలుగా చెబుతున్న‌ప్ప‌టికీ వాటిపై ఓ క్లారిటీ అనేది లేదు. అయితే ఉదయ్ కిరణ్ మరణించి 8 ఏళ్ళు దాటిపోతుండగా తాజాగా డైరెక్ట‌ర్ తేజ కొన్ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

సీక్రెట్ బ‌య‌ట‌పెడ‌తా..

ఇటీవ‌ల ఆయ‌న ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణాలు నాకు తెలుసు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నాతో ఫోన్లో చాలా విషయాలు చెప్పి చాలా బాధపడ్డాడు. అవే ఉదయ్ కిరణ్ ని ఆత్మహత్యకు పురిగొల్పాయి అని నేను అనుకుంటున్నాను. చనిపోయే లోపు అవేమిటో బయటపెడతాను అంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో తెలుసన్న తేజా ఆ విషయం భవిష్యత్ లో వెల్లడిస్తాను అని చెప్ప‌డంతో ఆయ‌న మ‌ర‌ణం వెన‌క ఎవ‌రో ఉన్నార‌ని ఈయ‌న మాట‌ల ద్వారా అర్ధం అవుతుంది.

చిత్రం మూవీతో ఉదయ్ కిరణ్ ని వెండితెరకు పరిచయం చేసింది తేజా అనే విష‌యం తెలిసిందే. దర్శకుడిగా తేజాకు అది మొదటి చిత్రం కాగా, రెండో చిత్రం కూడా తేజ-ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో వ‌చ్చింది. నువ్వు నేను పేరుతో ఈ సినిమా చేయ‌గా, ఇది మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఉదయ్ కిరణ్ ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సమయంలో ‘ఔనన్నా కాదన్నా’ టైటిల్ తో మరో చిత్రం చేశారు తేజ అది ఫ్లాప్ అయింది. కాగా, 2014 జనవరిలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు ఉదయ్ కిరణ్ సైన్ చేసిన చాలా సినిమాలు ఆగిపోయాయి.

also read:

7-11-2022 కార్తీక సోమవారం నేటి రాశి ఫలాలు

మునగాకు తింటే..మ‌స్తు బెనిఫిట్స్‌!

 

Exit mobile version