Twitter Blue Tick : సినీ, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు.. ఇలా ఎవరినీ వదలకుండా ఇటీవల బ్లూటిక్‌ను తొలగించింది ట్విట్టర్. ట్విట్టర్ బ్లూ సర్వీసులకు డబ్బు చెల్లించిన వారికి మాత్రమే బ్లూ టిక్ మార్క్ ఉండేలా చర్యలు తీసుకుంది ట్విట్టర్ మేనేజ్‌మెంట్.
ఈ నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు బ్లూ టిక్‌ను కోల్పోయారు. దీంతో ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్లూ టిక్‌ను ఇచ్చే విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
కనీసం 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల ఖాతాలకు బ్లూ టిక్‌ను పునరుద్ధరించారు. బ్లూ టిక్ మార్క్ కోల్పోయిన చాలా మంది ప్రముఖుల ఖాతాల్లో ఆదివారం తిరిగి అది కనిపించింది.
బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, అలియా భట్, క్రికెటర్లు కోహ్లీ, ధోనీ సహా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ బిల్ గేట్స్ వంటి వారి ట్విట్టర్ ఖాతాలన్నింటికీ ఇప్పుడు బ్లూ టిక్ మార్క్ వచ్చేసింది.
కొంతమంది ట్విటర్ ఖాతాలను తానే వ్యక్తిగతంగా చెల్లించి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సేవలను అందిస్తున్నట్లు ఎలన్ మస్క్ పేర్కొన్నారు.
లెబ్రాన్ జేమ్స్, విలియం శాట్నర్, స్టీఫెన్ కింగ్ వంటి వారి ఖాతాలకు తానే స్వయంగా డబ్బులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. వీరంతా తాము ట్విటర్ బ్లూను సబ్‌స్క్రైబ్ చేసుకోబోమని బహిరంగంగా ప్రకటించారు.
also read :
Arshdeep Singh : నిప్పులు చెరిగేలా బంతులు.. రెండుసార్లు వికెట్లు విరగ్గొట్టేసిన అర్ష్‌దీప్ సింగ్
US Visa : భారతీయులకు అగ్రరాజ్యం శుభవార్త.. ఈ ఏడాది 10 లక్షలకు పైగా వీసాలు!