Telugu Flash News

ఇండియాలో ఖలిస్తానీ మద్దతుదారుల ట్విట్టర్ అకౌంట్లు బ్లాక్

Pro-Khalistan Twitter accounts blocked in India : భారత్‌లో ఖలిస్తానీ సపోర్టర్ల ట్విట్టర్‌ అకౌంట్లను బ్లాక్‌ చేశారు. ఈ మేరకు ఈనెల 21నే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, బ్లాక్‌ చేసిన అకౌంట్లలో న్యూడెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ కెనడా నేత జగ్మీత్‌ సింగ్‌ ఖాతా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఖలిస్తానీ నేత అమృత్‌ పాల్‌ సింగ్‌పై పోలీసులు చర్యలు తీసుకోవడంతో దీన్ని నిరసిస్తూ చాలా మంది ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే పలువురి ఖాతాలను బ్లాక్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లోని ఇండియన్‌ కాన్సులేట్‌, హైకమిషన్‌లపై ఖలిస్తానీ వ్యక్తులు దాడులు చేసి విధ్వంసరచనకు కారణం కావడంతో ఈ చర్య తీసుకున్నారు.

కెనడా కవయిత్రి రూపి కౌర్, కార్యకర్త గురుదీప్‌ సింగ్‌ సహోటా ట్విట్టర్‌ అకౌంట్లు బ్లాక్‌ లిస్టులో పెట్టారు. జగ్మీత్‌ సింగ్‌ ఇండియా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. దీంతో అతని ట్విట్టర్‌ అకౌంట్‌ను కూడా అధికారులు బ్లాక్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఖలిస్తానీ మద్దతుదారుల దాడులపై భారత్‌ తీవ్రంగా స్పందిస్తోంది. ఈ నెల 19వ తేదీన ఆదివారం ఖలిస్తానీ సపోర్టర్లు లండన్‌లోని ఇండియన్‌ హైకమిషన్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతోపాటు మనదేశ జాతీయ జెండాను తీసేశారు. ఇదే సమయంలో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్‌ కాన్సులేట్‌పై ఖలిస్తానీ మూకలు దాడికి పాల్పడ్డాయి.

ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇండియా వీటిపై తీవ్రంగా రియాక్ట్‌ అయ్యింది. లండన్‌లో జరిగిన ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్‌ బ్రిటిష్‌ దౌత్యవేత్తను పిలిపించింది. ఇదే సమయంలో శాన్‌ఫ్రాన్సిస్కోలో విధ్వంసం జరిగాక ఢిల్లీలోని యూఎస్ చార్జ్‌ డీ అఫైర్స్‌తో జరిగిన భేటీలోనూ ఇండియా నిరసన తెలిపింది. ఈ నేపథ్యంలోనే యూఎస్ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి ఈ ఘటనను ఖండించారు. తాము ఇండియా దౌత్యవేత్తలు, వారి భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ఇక ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ దేశం నుంచి పారిపోవాలని తీవ్రంగా యత్నిస్తున్నాడని నిఘావర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. అమృత్‌పాల్‌ సింగ్‌ నేపాల్‌ మీదుగా కెనడా ఉడాయించే చాన్స్‌ ఉందని అధికారులు చెబుతున్నారు. చాలా కాలం దుబైలో ఉన్న అమృత్‌పాల్‌కు అక్కడే పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో సంబంధాలు ఏర్పడ్డాయని అధికారులు చెబుతున్నారు. అతడిని పాక్ ఐఎస్ఐ పావుగా వాడుకుంటోందని, పంజాబ్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు అమృత్‌పాల్‌ను వాడుకుంటున్నట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి.

also read :

Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావుపై అసత్య ప్రచారాల వెనుక ఆ రాజకీయ నేత అభిమానులు?!

RRR: ఆస్కార్ అవార్డ్ ఫంక్ష‌న్‌కి చిత్ర నిర్మాత వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌

Exit mobile version