HomehealthTurmeric benefits : ప‌సుపు ఆరోగ్యానికి ఎంత ప్ర‌యాజ‌నం క‌లిగిస్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Turmeric benefits : ప‌సుపు ఆరోగ్యానికి ఎంత ప్ర‌యాజ‌నం క‌లిగిస్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Telugu Flash News

Turmeric benefits : ప‌సుపుని ఎన్నో సంవ‌త్స‌రాలుగా కూర‌ల‌లో వాడుతున్న విష‌యం తెలిసిందే. చిటికెడు పసుపుతో ఎన్నో ప్రయోజనాలను ఉంటాయి. కొంతమంది ఆరోగ్యానికి పసుపు చాలా మంచిదిగా కాగా, మ‌రి కొంత‌మందికి అస్సలు మంచిది కాదని అంటుంటారు. పసుపులో కర్కుమిన్ పుష్కలంగా ఉండ‌డం వ‌ల‌న‌, ఇది శోషించుకోబడదు. ఎలుకలు తినే కర్కుమిన్ లో 1 శాతం కంటే తక్కువ శోషించుకుంటాయని అధ్యయనాలు చెబుతుండ‌డం గ‌మ‌న‌ర్హం. దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు పాలలో పసుపు వేసుకుని తీసుకుంటే మంచి ఫ‌లితం త‌ప్ప‌క ఉంటుంది.

బ‌హు ప్ర‌యోజ‌నం..

ఇక ఇంద‌లో ఉండే యాంటీ యాక్సిడెంట్ వ‌ల‌న లివ‌ర్ ప‌నితీరు మెరుగుప‌డుతుంది. . పసుపు మతిమరుపు కూడా రాకుండా చేస్తుంది. పసుపులో క్యాన్సర్‌ కణాలతో పోరాడే సమర్థ్యం ఎక్కువ‌. ఇందులో ఉండే యాంటీసెప్టిక్, యాస్ట్రింజెంట్ వల్ల శ్వాసకోస సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫాటిక్‌ సిస్టమ్‌ను కూడా శుద్ధిచేస్తాయ‌ని అధ్య‌య‌న‌నాలు చెబుతున్నాయి. పసుపు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. దీన్ని నిర్దిష్ట పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.

వంటల్లోనే కాకుండా బ్యూటీ టిప్స్ కోసం కూడా పసుపును వాడుతూ ఉంటారు. ఫేస్‌ప్యాక్స్‌, ఇన్ఫెక్షన్స్‌ రాకుండా ఉండేందుకు ఒళ్లంతా పసుపు రాసుకుని స్నానం చేయడం పాత కాలం నుండి వ‌స్తుంది. ప‌సుపుని ఎక్కువ‌గా కూడా తీసుకోకూడ‌దు. ఎంత అవ‌స‌ర‌మో అంత మాత్ర‌మే వాడాలి.

ఓ వ్యక్తి రోజుకు 1 -3 గ్రాములు పసుపు తీసుకుంటే మంచిది. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమనే చెపుతున్నారు నిపుణులు. పసుపు శరీరం ఇనుమును శోషించుకునే సామర్థ్యానికి అంతరాయం కలిగిస్తుందట‌. ఐర‌న్ లోపం ఉన్న‌వారు ప‌సుపు తీసుకోకపోవ‌డం మంచిది. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల తలతిరగడం, తలనొప్పి, కడుపునొప్పి, విరోచనాలు, ఉబ్బరం, వంటి సమస్యలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అంతే కాకుండా కిడ్నీల్లో రాళ్ళు కూడా ఏర్ప‌డ‌తాయి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News