Philippines : శనివారం రాత్రి 10.37 గంటలకు ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతంలో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం భూమికి 63 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఫిలిప్పీన్స్‌తో పాటు జపాన్‌లో సునామీ తాకే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి వరకు ఫిలిప్పీన్స్‌ను సునామీ తాకొచ్చని ఫిలిప్పీన్స్ సిస్మోలజీ ఏజెన్సీ పేర్కొంది.
గత నెలలోనూ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆ సమయంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 13 మంది గాయపడ్డారు. ఫసిపిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఫిలిప్పీన్స్, జపాన్, ఇండోనేషియా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో భూకంపాలు సాధారణంగా సంభవిస్తుంటాయి.
భూకంపం నుండి రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలు:
* భూకంపం సంభవించినప్పుడు భయపడకుండా, త్వరగా చర్యలు తీసుకోండి.
* భవనం లోపల ఉంటే, టేబుల్ లేదా ఇతర భారీ వస్తువుల కింద దాక్కుండి.
* భవనం వెలుపల ఉంటే, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లండి.
* భూకంపం ముగిసిన తర్వాత, సునామీ హెచ్చరిక జారీ చేశారా లేదా అనేది తెలుసుకోండి.
భూకంపం ఒక ప్రకృతి విపత్తు. దీనిని నివారించలేము, కానీ దాని నుండి రక్షించుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.
also read :
Magnitude 6.7 Earthquake Strikes Southern Philippines