సంక్రాంతి రద్దీని అధిగమించేందుకు టీఎస్ ఆర్టీసీ (TSRTC) చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. టోల్ ప్లాజాల వద్ద రద్దీ లేకుండా ఓ లేన్ ను కేటాయించేలా చర్యలు తీసుకుంది. స్పెషల్ బస్సులు నడపడం పాటు టోల్ ప్లాజాల వద్ద ఆలస్యం కాకుండా ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.
పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ చర్యలు తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద సులువుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా చర్యలు చేపట్టింది. ప్రధాన మార్గాల్లోని టోల్ ప్లాజాల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌లను కేటాయించాలని కోరుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ఆర్ అండ్ బీ విభాగాలకు లేఖలు రాసింది.
ఇదే అంశంపై టోల్ ప్లాజా నిర్వాహకులనూ సంప్రదించింది. తమ సంస్థ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయించాలని అభ్యర్థించింది. అందుకు ఆయా విభాగాలు అంగీకరించాయి. ఈ నెల 10 నుంచి 14 తేదీ వరకు టీఎస్‌ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయిస్తామని హామీ ఇచ్చాయి.
రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్-విజయవాడ మార్గంలోని పతంగి, కోర్లపహాడ్, హైదరాబాద్-వరంగల్ మార్గంలోని గూడూరు, హైదరాబాద్-సిద్దిపేట మార్గంలోని దుద్దేడ, హైదరాబాద్-నిజామాబాద్ మార్గంలోని మనోహరాబాద్, హైదరాబాద్-కర్నూలు మార్గంలోని రాయికల్ టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది.
ఆయా టోల్ ప్లాజాల వద్ద ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది మూడు షిప్ట్‌ల్లో 24 గంటలూ విధులు నిర్వహించనున్నారు. ఆర్టీసీ బస్సులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక లేన్ నుంచి బయటకు వెళ్లేందుకు స్థానిక పోలీసుల సహకారం కూడా టీఎస్‌ఆర్టీసీ తీసుకుంటోంది.
కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు
4 వేల 233 ప్రత్యేక బస్సులను ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు నడుపుతామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు పడే కన్నా.. టీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ ఈ సంక్రాంతికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు. హైదరాబాద్‌లోని బస్ భవన్, ఎంజీబీఎస్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసిందన్నారు.
Also Read:
Viral Video : క్యాన్సర్ రోగుల కోసం పెళ్లి కూతురు ఏం చేసిందో చూడండి.. మనసులు గెలిచింది!