వరకట్న వేధింపులు, అసహజ శృంగారానికి బలవంతం చేయడం వంటి కేసుల్లో ఐఏఎస్ అధికారి(TS IAS Officer) అయిన భర్తపై భార్య సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై స్పందించిన న్యాయస్థానం నిందితుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. తెలంగాణ కేడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా (sandeep kumar Jha) బీహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందినవారు. 2021లో కోర్బా ప్రాంతానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు కోటి రూపాయలకు పైగా కట్నంగా ఖర్చు చేశారని తెలిపారు. అయితే ఇటీవల జరిగిన సంఘటనలు భర్తపై పలు ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. భార్య కోర్బాలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)ని సంప్రదించి, వివాహానంతర కట్నం డిమాండ్‌లు, గృహహింస మరియు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నాడని పేర్కొంటూ ఫిర్యాదు చేసింది.
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత , సందీప్ కుమార్ ఝాపై ఎఫ్ఐఆర్ (first information report) ప్రారంభించాలని కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సందీప్ కుమార్ తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు.
read more news :
Heat Wave : నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు🔥.. వడదెబ్బకు గురై విలేకరి అజీముద్దీన్ మృతి
Minister Roja: మంత్రి రోజాకు అస్వస్థత 😥 అపోలో ఆస్పత్రికి తరలింపు