చలికాలం వచ్చిందంటే చాలు కిచిడీ తినాలనే కోరిక పెరుగుతుంది. కిచిడి అనేది పౌష్టికాహారం మాత్రమే కాదు, తేలిగ్గా అరిగే ఆహారం కూడా. సజ్జలతో చేసే కిచిడి (bajra khichdi) రుచి చాలా బాగుంటుంది. పెరుగు లేదా రైతాతో కలిపి దీనిని తినచ్చు.
ముఖ్యంగా రాజస్థాన్‌లో ఈ కిచిడి తయారు చేసే ట్రెండ్ ఉంది మరియు అక్కడ రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు కిచిడి ప్రేమికులైతే విభిన్న రుచులలో దీనిని ప్రయత్నించాలనుకుంటే, ఈ వంటకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది..
సజ్జలతో కిచిడి తయారీ కి కావలసినవి:
సజ్జలు – 1/2 కప్పు
పెసర పప్పు – 1/2 కప్పు
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
ఇంగువ – 1 చిటికెడు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
పసుపు – 1/4 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి తగ్గట్టుగా
సజ్జలతో కిచిడి తయారీ విధానం:
ముందుగా సజ్జలని 8 నుండి 9 గంటలు నీటిలో నానబెట్టండి. తరువాత జల్లెడ సహాయంతో అందులో నుండి అదనపు నీటిని తొలగించండి.
ఇప్పుడు నానబెట్టిన సజ్జలని, పెసర పప్పు మరియు కొద్దిగా ఉప్పును ప్రెషర్ కుక్కర్‌లో వేయండి. కుక్కర్‌లో 2 కప్పుల నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. దీని తరువాత, గ్యాస్ ఆఫ్ చేయండి.
ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకుని, అందులో నెయ్యి వేసి, మీడియం మంట మీద వేడి చేయండి. జీలకర్ర వేసి నెయ్యి కరిగే వరకు కొన్ని సెకన్ల పాటు వేయించాలి. జీలకర్ర వేగాక, చిటికెడు ఇంగువ మరియు పసుపు వేసి, గరిటె సహాయంతో బాగా కలపాలి.
మసాలాలు వేయించినప్పుడు, ఉడికించిన సజ్జలు, పెసర పప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. దీని తరువాత, కిచిడిలో ఉప్పు వేసి బాగా కలపాలి.
also read these news:
Bigg Boss 6 : ఇనయ, ఫైమా మధ్య తారాస్థాయికి చేరుకున్న గొడవలు..హీటెక్కిపోతున్న హౌజ్