Telugu Flash News

Indigestion: వేసవిలో అజీర్తి నివారణకు ఇవి తినండి..

ఎండాకాలం అంటే.. ఉక్కపోతతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అసిడిటీ, పొత్తి కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు అటాక్‌ చేస్తాయి. బాడీలో నీటి కొరత, వేడి వాతావరణం, ఆహారంలో ఫైబర్ లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, తిన్న వెంటనే నిద్రపోవడం వంటివి కారణాలు అవుతాయి.

ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే కొన్ని ఆరోగ్యకరమైన ఫుడ్స్‌ తీసుకోవాలి. బరువు తగ్గించే వాటిలో క్వినోవా బాగా పని చేస్తుంది. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి. టైప్ 2 డయాబెటిస్ ని నియంత్రిస్తుంది. వేసవిలో అజీర్ణ సమస్యని తగ్గిస్తుంది.

బచ్చలికూర, పాలకూర, క్యాబేజ్, బ్రొకోలి, కాలీఫ్లవర్ వంటి వాటిలో నీటి శాతం ఉంటుంది. ఇవి జీర్ణక్రియను సవ్యంగా సాగేలా చూస్తాయి. వేసవిలో శరీరం డీహైడ్రేట్ బారిన పడకుండా ఇవి రక్షిస్తాయి.

దోసకాయలో నీటి కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి తింటే రీఫ్రెష్ గా అనిపిస్తుంది. ఫైబర్ తో నిండిన ఫుడ్‌ కావడంతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇక పుచ్చకాయ, పెరుగు, టమాటాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ లాంటివి తీసుకున్నా నీటి కంటెంట్‌ అధికంగా ఉండటంతో పాటు అజీర్తి సమస్యలను పారదోలేందుకు సాయపడతాయి. ముఖ్యంగా వేసవిలో తప్పనిసరిగా మజ్జిగను తాగాలి. జీర్ణశక్తిని ఇది పెంచుతుంది.

Read Also : Ileana: బిడ్డ తండ్రి ఎవ‌రో చెప్ప‌కుండా.. ఇలా వ‌రుస బేబి బంప్ ఫోటోల‌తో ఇలియానా ర‌చ్చ‌

Exit mobile version