Telugu Flash News

Trisha : పెళ్లి, విడాకుల‌పై స్పందించిన త్రిష‌.. త‌న పెళ్లిపై ఏమ‌ని అన్న‌దంటే…!

Trisha : చెన్నై చంద్రం త్రిష గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. క్యూట్ క్యూట్ అందంతో పాటు ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది. టాలీవుడ్‌లో ప‌దేళ్ల పాటు ఓ ఊపు ఊపిన త్రిష కొన్నాళ్లుగా తెలుగులో సినిమాలు త‌గ్గించేసింది. కేవ‌లం త‌మిళంలో మాత్ర‌మే చేస్తుంది. రీసెంట్‌గా పోన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రంతో ప‌ల‌క‌రించిన త్రిష త‌న న‌ట‌న‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా వినోదం పంచింది. అయితే త్రిష నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్నా.. పెళ్లి ఆలోచ‌న చేయ‌డం లేదు. ఆ మ‌ధ్య చెన్నైకి చెందిన బిజినెస్ మెన్ తో ఎంగేజ్మెంట్ అయినా.. ఆతరువాత బ్రేకప్ చెప్పేసి సింగిల్‌గా ఉంటుంది.

పెళ్లిపై త్రిష స్పందన‌..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 40 ఏళ్ళు వస్తున్నా తాను ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవడానికి ప్రత్యేక కారణమేమి లేదని చెప్పుకొచ్చింది త్రిష‌. అంతే కాదు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి గ‌ల ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేదని చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తనకు తెలియదని క్లారిటీ ఇచ్చింది ఇక త‌న మ‌న‌సుకు న‌చ్చిన వాడు దొర‌క‌లేద‌ని , అత‌ను దొరికిన‌ప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని స్ప‌ష్టం చేసింది. ఒక్క సారి పెళ్లి చేసుకుంటే ఇక జీవితాంతం హ్యాపీగా ఉండేలా త‌న లైఫ్‌ని సెట్ చేసుకోవాల‌ని అనుకుంటుంది త్రిష‌.

పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం తనకు నచ్చదని అంటుంది త్రిష‌.. ఇక త్రిష అభిమానులంతా ఈ అమ్మ‌డు ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. త్రిష విష‌యానికి వస్తే ఈ అమ్మ‌డు టాలీవుడ్ టాప్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసిన విష‌యం విదిత‌మే. వ‌ర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల‌తో త్రిష తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది.

Exit mobile version