Telugu Flash News

హైటెక్ సిటీలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురు మృతి

train accident at hitech city railway station

హైటెక్ సిటీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్‌పై వెళ్తున్న ముగ్గురిని వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణలుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రైలు పట్టాలు దాటే సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రైల్వే వంతెనలు నిర్మించారు. అయితే నిర్లక్ష్యం కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. అందుకే రైలులో ప్రయాణించేటప్పుడు లేదా ట్రాక్ దాటుతున్నప్పుడు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Exit mobile version