Amazon Prime : అలరించే 5 ప్రైమ్ వీడియో సీరీస్ లు మీకోసం..
TFN
Amazon Prime : మిమ్మల్ని అలరించే 5 ప్రైమ్ వీడియో సీరీస్ లు మీకోసం అందిస్తున్నాము. తప్పకుండా చూడండి.. చూసి ఆనందించండి..
1.మెంటలిస్ట్ (The Mentalist)
అమెరికన్ క్రైం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా 2008లో టీవీలో ప్రసారమైన మెంటలిస్ట్ మొత్తం 7 సీజన్స్ గా తెరకెక్కి చివరిగా 2015లో ముగిసింది.ఈ సీరీస్ లోని హీరో వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకునే విధంగా,ఆసక్తికరంగా ఉంటుంది. హాలీవుడ్ నటినటులు సైమన్ బేకర్, రాబిన్ టున్నే, అమాండా రిగ్గేటి,టిమ్ కాంగ్, ఓవేన్ యోమన్ ప్రధాన పాత్రలు పోషించగా,దర్శకుడు క్రిస్ లాంగ్ ఈ సీరీస్ ను తెరకెక్కించారు.ప్రతి క్షణం ఉత్కంటంగా సాగే అద్భుతమైన సన్నివేశాలను అనుభూతి చెందాలంటే ఈ సీరీస్ చూడాల్సిందే.
2.వాంపైర్ డైరీస్ (The Vampire Diaries)
వాంపైర్ ల ఆధారంగా తెరకెక్కిన ఈ అమెరికన్ సీరీస్ విభిన్నమైన కథతో ఆసక్తికరంగా సాగిపోతుంది. మొత్తం 8 సీజన్లుగా తెరకెక్కిన ఈ సీరీస్ ప్రతి సీజన్ లో తనదైన కొత్త ధనాన్ని కనపరుస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. హాలీవుడ్ కి చెందిన పాల్ వెస్లీ,నినా డొబ్రేవ్,ఇయన్ సోమర్ హల్డర్, కాండిస్ కింగ్,మాథ్యూ డెవిస్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు.ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్క సారైనా చూడాల్సిన అద్భుతమైన సీరీస్ ఇది.
3.మోడ్రన్ లవ్ ముంబై (Modern Love Mumbai)
అమెరికన్ సీరీస్ “మోడ్రన్ లవ్” ఆధారంగా తెరకెక్కిన ఈ సీరీస్ 6 విభిన్నమైన కథలతో తనదైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సీరీస్ ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంటుంది. అర్షడ్ వాసి, చిత్రాంగద సింగ్, నసీరుద్దీన్ షా,తనూజ,యహాసాస్ చన్న,అదర్ మాలిక్ ప్రధాన పాత్రలలో నటించగా,దర్శకుడు నుపుర్ ఆస్థాన ఈ సీరీస్ ను తెరకెక్కించారు.
4.సుజల్ – ది ఓర్టెక్స్ (Suzhal: The Vortex)
ఈ సీరీస్ రొటీన్ క్రైం థ్రిల్లర్లకు బిన్నంగా ప్రేక్షకులను ఆశ్చర్య పరిచే సన్నివేశాలతో తెరకెక్కింది.8 ఎపిసోడ్లతో ఉండే ఈ సీరీస్ ప్రతి ఎపిసోడ్ దాదాపుగా 40 నిమిషాల నిడివితో ఎక్కడ బోర్ కొట్టకుండా సాగిపోతుంది.”విక్రమ్ వేదా” సినిమా దర్శకులు పుష్కర్,గాయత్రి రచయితలుగా
వ్యవహరించగా,బ్రహ్మా జీ,అనుచరన్ మురుగేయన్ ఈ సీరీస్ ను తెరకెక్కించారు.ఐశ్వర్య రాజేష్ తనదైన నటనతో అలరించగా,శ్రియా రెడ్డి, పార్తీబన్,కథిర్ ప్రధాన పాత్రలు పోషించారు.
5.రింగ్స్ ఆఫ్ పవర్ (The Rings of Power)
లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కు ప్రీక్వెల్ గా విడుదలైన “రింగ్స్ ఆఫ్ పవర్” వచ్చిన కొంత సమయంలోనే రికార్డ్ లను బద్దలు కొట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటివరకు ఏ సీరీస్ పొందని ఆదరణను పొందటంతో పాటు విడుదలైన 24 గంటల్లోనే 25 మిలియన్ల వీక్షకులను చేరి రికార్డ్ని సృష్టించింది. భిన్నమైన ప్రపంచంతో,అబ్బురపరిచే విజువల్స్ తో ప్రేక్షకులను ఈ సీరీస్ కట్టిపడేస్తుంది. అటువంటి మాయలో మునిగి ఆనందాన్ని పొందాలంటే ఈ సీరీస్ ని తప్పక చూడాల్సిందే.