Tomato Eguru Recipe in Telugu |
టమాటో ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు :
టమాటో ముక్కలు అర కిలో ; నూనె రెండు టేబుల్ స్పూన్లు ;
శనగపప్పు 1 టేబుల్ స్పూన్ ;
మినపప్పు 1 టేబుల్ స్పూన్;
జీలకర్ర అర చెంచా;
ఆవాలు 1 టేబుల్ స్పూన్;
కరివేపాకు రెండు రెబ్బలు;
ఉల్లిపాయ ఒకటి;
చింతపండు గుజ్జు పావు కప్పు;
బెల్లం తరుగు రెండు చెంచాలు;
ఉప్పు తగినంత;
కొత్తిమీర ఒక కట్ట;
మసాలా కోసం
మెంతులు పావు చెంచా;
ధనియాలు పావు చెంచా;
జీలకర్ర టేబుల్ స్పూన్;
మినపప్పు 1 టేబుల్ స్పూన్;
శనగపప్పు 1 టేబుల్ స్పూన్;
ఎండుమిర్చి ఎనిమిది;
కరివేపాకు రెబ్బలు రెండు;
ఇంగువ చిటికెడు;
తయారీ విధానం
స్టవ్ మీద కడాయిని పెట్టి , మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి వేయించుకొని ఆ తర్వాత మిక్సీలో పొడి చేసుకుని పెట్టుకోవాలి .
ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కడాయిని పెట్టి నూనె వేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఆవాలు వేయించుకొని కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
అవి వేగాక టమాటో ముక్కలు మూడు చెంచాల మసాలా పొడి మిగిలిన పదార్థాలు వేసి బాగా కలిపి అరకప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ విశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు స్టవ్ ని ఆపేయాలి.
also read :
10 healthy snacks that can help for Weight Loss
Carrot Capsicum Rice : క్యారెట్ క్యాప్సికం రైస్.. ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది ..