Telugu Flash News

Tollywood News : చిరంజీవి, బాల‌కృష్ణ‌ల భార్య‌ల‌లో ఈ కామ‌న్ పాయింట్ గుర్తించారా..!

surekha and vasundhara

Tollywood News: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి రెండు క‌ళ్ల‌లాంటి వారు అని చెప్ప‌వ‌చ్చు. అభిమానుల విషయంలో ఇద్దరిలో ఎవ్వరినీ తక్కువ చేయడానికి లేదు.

వీరి సినిమా ఒక సీజన్‌లో విడుదలవుతుందంటే.. ఫ్యాన్స్ హడావిడి అంతా ఇంతా ఉండదు. రీసెంట్‌గా సంక్రాంతి సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రు హీరోలు సంద‌డి చేశారు. అయితే ఈ హీరోలు ఇండస్ట్రీలో ఎంత స్టార్స్ గా ఉన్నారో ఈ హీరోల భార్యలు ఇల్లాలుగా అంతే పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చుకున్నారు.

ఏనాడు ఓ మాట వీళ్ల గురించి నెగటివ్‌గా వినిపించిందే లేదు . అంతలా తెలుగింటి సాంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటారు . కాగా సురేఖలో ..బాలయ్య భార్య వసుంధరలో ఉన్న కామన్ పాయింట్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.

చిరంజీవి భార్య సురేఖ ఇంటికి వచ్చిన వాళ్ళకి లేదు కాదు అనుకుండా హెల్ప్ చేస్తుందట.

అభిమాని అయినా.. ఇంట్లోని పనివాళ్ళు అయినా ..ఇంటికి వచ్చిన స్టార్ హీరోస్ అయినా.. ఎవరైనా సరే ఇంటికి వస్తే కడుపు నిండా తినిపించి.. సంతోషంగా అడుగు బయటకు పెట్టేలా చేస్తుందట సురేఖ.

బాలయ్య భార్య వసుంధర కూడా అంతే . ఇంటికి వచ్చిన వాళ్ళకి గౌరవ మర్యాదల్లో ఏమాత్రం లోటు చేయకుండా నందమూరి పరువు పేరు ప్రతిష్టలను డబుల్ చేస్తుంది అని బాల‌య్య ఓ సంద‌ర్భంలో త‌న భార్య గురించి గొప్ప‌గా చెప్పాడు.

ఇద్ద‌రు స్టార్ హీరోల భార్య‌ల‌లో ఇంతటి మంచి త‌నం చూసి ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే చిరు, బాల‌య్య కాంబినేష‌న్‌లో ఓ సినిమా వ‌స్తే బాగుండు అని అంద‌రు భావిస్తున్నారు.

also read :

Pawan Kalyan Varahi: ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన వారాహి.. అసలు సంగ్రామం ఇప్పుడు మొదలవుతుందా?

Sharwanand – Rakshitha reddy Engagement Photos

ODI Rankings : ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన శుభమన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌..

Exit mobile version