ఈ రోజు వాతావరణం ఎలా ఉందంటే .. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ముందుజాగ్రత్తగా చిత్తూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది.
also read news: