today weather report : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి . ఉక్కపోతకు తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధవారం సాయంత్రం వాతావరణం కాస్త చల్లబడింది. ఉక్కపోత నుండి ఉపశమనం లభించింది. అయితే రానున్న మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో నిన్న ఏర్పడిన తుఫాను బుధవారం బలహీనపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, నల్లగొండ, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో బుధవారం వడగళ్ల వాన కురిసింది. గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీచే అవకాశం ఉంది.
read more :