ఈరోజు వాతావరణం ఎలా ఉందంటే , బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ వర్షాలతో అతలాకుతలం అవుతుందన్నారు.
నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈనెల 7, 8, 9 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు సోమవారం ఈదురు గాలుల ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షం కురిసింది.
రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని చదవండి :
నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం.. ఎప్పుడంటే ?
Dyslexia : డిస్లెక్సియా ఎందుకు వస్తుంది? కారణాలు మరియు పరిష్కారాలు..