Telugu Flash News

today rasi phalalu in telugu : 20/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu

20/08/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you: roju vari rasi phalalu 2023. Stay updated with Rashi Phalalu today in Telugu and uncover Rashi Phalalu today in Telugu, offering guidance and predictions for your zodiac sign in 2023.

మేషం

ఈ రాశి వారికి ధనధాన్యాభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు కొంత‌ సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.

వృషభం

ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్తలు అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకుంటే మంచింది. స్వల్ప అనారోగ్యబాధలు ఏర్ప‌డ‌తాయి. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా ఉండాలి. రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.

మిథునం

ఈ రాశి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధించ‌గ‌లుగుతారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఏర్ప‌డుతుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.

కర్కాటకం

విదేశయాన ప్రయత్నం సులభంగా ఏర్ప‌డుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండ‌వు. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేసే ఛాన్స్ ఉంది. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

సింహం

గౌరవ మర్యాదలకు ఎలాంటి లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు చేస్తారు. వృధా ప్రయాణాలు కూడా ఎక్కుగానే ఉంటాయి. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తలు వహించాలి. శారీరకంగా బలహీనులు అయ్యే అవ‌కాశం ఉంది. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్థాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

కన్య

వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమించ‌గ‌లుగుతారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు వ‌స్తాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా వ‌హించాలి. నిరుత్సాహం ఏ మాత్రం ప‌నికి రాదు.మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.

తుల

ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు వ‌స్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వ‌స్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఏర్ప‌డుతుంది.విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి.

వృశ్చికం

వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని బాగా పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు వెంట‌నే నెర‌వేరుతాయి.కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.

ధనస్సు

శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెర‌వేర‌తాయి. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొన‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందే అవ‌కాశం ఉంది. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

మకరం

ఆత్మీయుల సహకారం ఎక్కువ‌గా లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులయ్యే ఛాన్స్ ఉంది. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

కుంభం

అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం చాలా అవ‌స‌రం. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా ఉండాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ల‌కుండా ఉండ‌డం మంచిది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.

మీనం

వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోయే అవ‌కాశం ఉంది. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.

also read :

poha halwa : అటుకులతో హల్వా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Coconut Halwa : కొబ్బరితో హల్వా.. ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

 

 

 

Exit mobile version