Homedevotionaltoday horoscope in telugu : 30-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

today horoscope in telugu : 30-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

today horoscope in telugu : ఈ రోజు రాశి ఫలాలు 30-05-2023 తేదీన మీ మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలని సూచన. విశ్రాంతి కలుగును. అనుకున్న పనులు స‌కాలంలో పూర్తి చేసెదరు. ముఖ్యమైన వాటికోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలిగే అవ‌కాశం ఉంది.

వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి భోజన సౌఖ్యము కలుగుతుంది. రాజకీయాలకు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఖర్చులు అధికముగా ఉండును. అవి నియంత్రించుకోవాలని సూచన. ఎవ‌రితోను వివాదాలు పెట్టుకోవ‌ద్దు. ఏ ప‌నిలో అయిన కూడా కాస్త ఆలోచించి మాట్లాడ‌డం మంచిది.

మిథున రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారు నేడు ఆహ్లాదముగా గడిపెదరు. ఖర్చులు నియంత్రించుకోవల్సి ఉంటుంది.. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేస్తారు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుటచేత మిథున రాశివారికి కలసివ‌స్తుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం వ‌ల‌న ఫ‌లితాలు బాగుంటాయి.

కర్కాటక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారు వివాదాలకు, చర్చలకు దూరంగా ఉండాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించ‌డం మంచిది. పనులయందు, ప్రయాణములయందు జాగ్రత్తలు పాటించాలి. జన్మరాశియందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోవల్సి ఉంటుంది.

సింహ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి నేడు ఎంతో అనుకూలముగా ఉన్నది. ఆహ్లాదముగా గడుపుతారు. అవసరార్థం ధనాన్ని ఖర్చు చేస్తారు. సౌఖ్యమును పొందుతారు. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

-Advertisement-

today horoscope in teluguకన్య రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి చేసే ప్ర‌తి ప‌నిలో సంతోషం ద‌క్కుతుంది. ముఖ్యమైన పనులు కోసం ధనమును ఖర్చు చేస్తారు. రవి అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగుతుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.

తులా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి ప్రయాణములు అనుకూలించును. వీరికి సమస్యలు, వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండ‌వ‌లసి ఉంటుంది. శివాలయాన్ని దర్శించండం వంటివి చేయండి. శనికి తైలాభిషేకం చేసుకోవడం కూడా ఉత్త‌మ ఫ‌లితాల‌ని క‌లిగిస్తుంది. లింగాష్టకాన్ని పఠించడం చేయండి.

వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.. ఆందోళనలు తక్కువ‌గా ఉంటుంది.. ఉద్యోగస్తులకు ఒత్తిళు అధికము. చేయాల్సిన ప్ర‌తి ప‌నిలో కూడా ఆచితూచి చేయ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. కీల‌క విష‌యాల‌లో కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.

ధనుస్సు రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి అనుకున్న పనులు పూర్తి అవుతాయి.. ఖర్చులు లాభిస్తాయి. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. ధన లాభము కలుగుతుంది. అంత‌టా శుభ‌ఫ‌లితాలు క‌లుగుతాయి.

మకర రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి ఆరోగ్య విషయాలయందు కుటుంబ వ్యవహారాలయందు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావంచేత కుటుంబములో సమస్యలు, ఘర్షణలు ఎక్కువ అవుతాయి.

కుంభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి ప్రయాణములో చికాకులు కలుగుతుంది.. శారీరక శ్రమ ఒత్తిళ్ళు ఏర్పడుతాయి. కుటుంబ విషయాలయందు జాగ్రత్తలు వహించ‌డం మంచిది. అనుకూల స్థితివలన అనుకున్న ప్రతీ పని అనుకున్న స‌కాలంలో పూర్తి చేసెదరు. శివాలయాన్ని దర్శించడం చేయండి.

మీన రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాలయందు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు నియత్రించుకోవల్సిన సమయము. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం మంచి ఫ‌లితాలు ల‌భిస్తాయి.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News