Homedevotionaltoday horoscope in telugu : 29-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

today horoscope in telugu : 29-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

today horoscope in telugu : ఈ రోజు రాశి ఫలాలు 29-05-2023 తేదీన మీ మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

మేషం

ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోయే అవ‌కాశం ఉంది. తలపెట్టిన పనులు శ్రమ మీద పూర్తి చేస్తారు. ఆరోగ్యం కొంత నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధించే అవ‌కాశం ఉంది. కుటుంబానికి సంబంధించి కీల‌క‌ నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన క్ర‌మంగా పెరుగుతుంది.

వృషభం

ఈ రాశి వారికి ఆదాయంలో కొద్దిగా పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారం చాలావరకు మంచిగానే సాగుతుంది.. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది .మిత్రుల వల్ల కొంత మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త‌లు పాటించాలి.

మిథునం

ఈ రాశి వారికి ఆర్థిక స్తోమత బాగా మెరుగుపడుతుంది. సమాజానికి మేలు కలిగే పనులు చేయ‌డం వ‌ల‌న ప్ర‌శంస‌లు పొందుతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడే అవ‌కాశం ఉంది.. ఆర్థిక లావాదేవీలకు కాస్త‌ దూరంగా ఉండండి. కొద్దిగా రుణ బాధ తగ్గే అవ‌కాశం ఉంది. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం చేకూరే అవ‌కాశం ఉంది.

కర్కాటకం

ఈ రాశి వారికి ఆదాయం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊర్లోనే మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి కాస్త‌ మెరుగ్గా ఉంటుంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేసే ఛాన్స్ ఉంది.. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండే అవ‌కాశం ఉంది.

సింహం

ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు పరవాలేదు అని చెప్పాలి.. కుటుంబ వాతావరణం కొంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది.. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వినే అవ‌కాశం ఉంది.

-Advertisement-

కన్య

ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగే అవ‌కాశం ఉంది. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి బయటపడ‌డంతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం చేయండి.

తుల

ఈ రాశి వారికి రాదనుకున్న డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. పట్టుదలతో కొన్ని ముఖ్య‌మైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు కొద్దిగా కష్టపడితే మంచిది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది.. పిల్లల నుంచి ఎక్కువ‌గా శుభవార్త వింటారు. అదనపు ఆదాయానికి ప్రయత్నాలు చేసే ఛాన్స్ ఉంది.

వృశ్చికం

ఈ రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు వెళ‌తాయి.. కొత్త సేవలో నిమగ్నం అయ్యే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుప‌డుతుంది. పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించే ఛాన్స్ ఉంది.

ధనుస్సు

ఈ రాశి వారికి ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి ఏ మాత్రం లోటు ఉండదు . రాదనుకున్న డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. అనుకున్న పనులు స‌కాలంలో పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు కొంత చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో కొద్దిగా ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవ‌కాశం ఉంది.

మకరం

ఈ రాశి వారు ఉద్యోగంలో బాగా శ్రమ ఉన్నా, అనుకున్న లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆదాయానికి ఏ మాత్రం లోటుండదు. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఎవరికీ ఎక్కడా హామీలు ఇవ్వ‌కుండా ఉంటే ఉత్త‌మం.

కుంభం

ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది.. వ్యక్తిగత సమస్య ఒకటి స్నేహితుల సహాయంతో పరిష్కారం అయ్యే అవ‌కాశం కూడా ఉంది.. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులకు ఆర్థికంగా స‌హాయ ప‌డే అవ‌కాశం ఉంది.

మీనం

ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం పరవాలేదు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా స్థిరత్వం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.. కుటుంబ సమస్య ఒకటి సామరస్యంగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. స్నేహితులు చేదోడు వాదోడుగా ఉంటారు. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వ‌చ్చే ఛాన్స్ ఉంది.

read more posts :

Devotional: శంఖం సంపదకు ప్రతిరూపం.. ఎలా పూజించాలంటే..

Samantha: అఖిల్ స‌ర‌స‌న క‌నిపించ‌నున్న స‌మంత‌.. ఇది నిజంగా క్రేజీ న్యూసే..!

Keerthy Suresh : ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న కీర్తి సురేష్‌ సోదరి.. అక్కా,చెల్లెళ్లు దున్నేస్తారేమో..!

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News