Telugu Flash News

today horoscope in telugu : 26-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

horoscope 26th may

today horoscope in telugu : ఈ రోజు రాశి ఫలాలు 26-05-2023 తేదీన మీ మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

మేషం

ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు త‌లెత్తుతాయి.. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. సంతానానికి సంబంధించి శుభవార్త లు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

వృషభం

ఈ రాశి వారికి ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కొంత‌ తగ్గుముఖం పట్టే అవ‌కాశం ఉంది.. ఆర్థికంగా కాస్తంత పుంజుకుంటారు. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేసే ఛాన్స్ ఉంది. ఏ విష‌యంలో అయిన ఆచి తూచి అడుగు వేయడం మంచిది.

మిథునం

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. అవసరమైన పనులు పూర్తి చేసే అవ‌కాశం ఉంది. కోర్టు కేసులో విజయం సాధించ‌గ‌లుగుతారు. విద్యార్థులకు ఈరోజు మంచిగా ఉంటుంది.

కర్కాటకం

ఈ రాశి వారికి ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హాయిగా సాగిపోతుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేయ‌డంతో సంతోషంగా ఉంటారు. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా ఉండ‌క‌పోవ‌డంతో ఇబ్బంది ప‌డ‌తారు. పెళ్లి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉంది.

సింహం

ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా మంచిగా ఉంటుంది.. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఎక్కువ‌గా ఉంది. చిన్ననాటి స్నేహితులని కలుసుకుంటారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధించే అవ‌కాశం ఉంది..

కన్య

ఈ రాశి వారు ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి విశేష పురోగతి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉద్యోగ జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పవనే చెప్పాలి. పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోంటారు. స్నేహితులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది.

తుల

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంది . వ్యాపారంలో ఆశించినంతగా లాభాలు రాకపోవచ్చు. ఇరుగుపొరుగుతో పేచీలు తలెత్తే అవకాశం కూడా ఎక్కువ‌. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు.

వృశ్చికం

ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల అభిమానం సంపాదిస్తారు. విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఎక్కువ‌గా ఉంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది. స్నేహితులు నమ్మించి మోసం చేస్తారు.. ఎవరికీ వాగ్దానాలు చేయకండి. హామీలు ఇవ్వ‌కండి.

ధనుస్సు

ఈ రాశి వారికి ఆదాయ పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగ జీవితం కొంత వ‌ర‌కు బాగానే సాగిపోతుంది. కొద్దిపాటి అనారోగ్యం త‌లెత్తే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల వ‌ల‌న కొద్దిగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి.. పిల్లలు శుభవార్త తీసుకువస్తారు.

మకరం

ఈ రాశి వారు సమయోచిత నిర్ణయాలతో కుటుంబ సమస్యను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండ‌డం ఉత్త‌మం. ఆర్థిక లావాదేవీలు ఏ మాత్రం పెట్టుకోవద్దు. సొంత పనులకు ప్రాధాన్యం ఇస్తే మంచిది. మితిమీరిన ఔదార్యం వల్ల కొంత నష్టపోతారు.

కుంభం

ఈ రాశి వారు ఇతరులకు మేలు జరిగే పనులు ఎక్కువ‌గా చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా అవరోధాలు ఎదురైనప్పటికీ చక్కని అభివృద్ధిని పొందుతారు. ఐటీ రంగం వారికి మంచి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది. బంధువుల ద్వారా ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరే అవ‌కాశం ఉంది.

మీనం

ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. వివాదాలకు ఆస్కారం ఎక్కువ‌గా ఉంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెర‌గ‌డం వ‌ల‌న సంతోషంగా ఫీల‌వుతారు.. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగుతారు.

read more news :

Priyanka Chopra: నా ‘లో’ దుస్తులు ఆ డైరెక్ట‌ర్ చూడాల‌ని అనుకున్నాడు

Whatsapp: వాట్సప్‌లో కొత్త ఫీచర్లు.. ఫోన్‌ నంబర్లు కనిపించవు!

Amaravati: అమరావతిలో తొలిసారి సీఎం జగన్‌ బహిరంగ సభ.. ఆ రైతుల నిరసన లెక్కచేయరా?

Telangana: తగ్గేదే లే.. కేంద్రం, రాష్ట్రం పోటాపోటీగా రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు ప్లాన్!

Viral Video: పెద్దాయన ఐడియాకి ఫిదా.. సైకిల్‌ను కూలింగ్‌గా మార్చేశాడు..!

 

 

Exit mobile version