Homedevotionaltoday horoscope in telugu : 24-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

today horoscope in telugu : 24-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

today horoscope in telugu : ఈ రోజు రాశి ఫలాలు 24-05-2023 తేదీన మీ మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మంచిగానే ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తారు. ఉద్యోగ జీవితం ప్ర‌శాంతంగా సాగిపోతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం చేయండి. విద్యార్థులు ఆశించిన స్థాయిలో రాణించడం వ‌ల‌న తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు.

వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు ఎక్కువ‌గా లభిస్తాయి. హామీలు ఇవ్వడం, వాగ్దానాలు చేయడం ప్రస్తుతానికి ఏ మాత్రం మంచిది కాదు. ఉద్యోగ పరంగా కొంత మేలు జరురిగే అవ‌కాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మంద పొడిగా ముందుకు వెళ‌తాయి

మిథున రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది. కుటుంబ విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్త‌మం . ప్రేమ వ్యవహారాలలో శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం విష‌యంలో ఆచితూచి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఉత్త‌మం.

కర్కాటక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు వెళుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రోజు సాఫీగా న‌డుస్తుంది. నిరుద్యోగులకు సమయం ఏ మాత్రం అనుకూలంగా లేదు. హామీలు ఇవ్వ‌కుండా ఉండాలి,. ప్రేమ వ్యవహారాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి.

సింహ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అధికారులు అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువ‌గా ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం వ‌ల‌న కొంత మెరుగ్గా అనిపిస్తుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సిన స‌మ‌యం. ప్రేమ వ్యవహారాలు ఆశించినంతగా ఉండ‌వు.

-Advertisement-

today horoscope in teluguకన్య రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి చిన్నపాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒక‌టి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితాలు ల‌భిస్తాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపు వచ్చే అవ‌కాశం ఉంది.. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి.

తుల రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ అవసరాలకు మించి ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో సహచరుల నుంచి చిన్న‌పాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు ఏ మాత్రం పనికిరాదు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.

వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారు వ్యాపార ప‌రంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. గొడ‌వ‌ల‌కు సాధ్య‌మైనంత దూరంగా ఉండ‌డం ఉత్త‌మం. చిన్న‌పాటి స‌మ‌స్య‌ల వ‌ల‌న ఆందోళ‌న‌కి గుర‌య్యే అవ‌కాశం ఉంది. లేని పోని స‌మస్య‌లు కొనితెచ్చుకోకుండా జాగ్ర‌త్త‌లు పాటించ‌డం ఉత్త‌మం.

ధనుస్సు రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి సంబంధించి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగే ఛాన్స్ కూడా ఉంది.. ముఖ్యమైన పనులను సునాయాసంగా పూర్తి చేయ‌డంలో విజ‌యం సాధిస్తారు.

మకర రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవ‌కాశం కూడా ఉంది.. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా ముందుకు సాగుతాయి.

కుంభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి అనవసర ఖర్చులు ఎంతో ఇబ్బంది పెడతాయి. అదనపు ఆదాయం కోసం ఎక్కువ ప్ర‌య‌త్నాలు చేస్తారు. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధార పడే అవ‌కాశః ఉంది. వృత్తి నిపుణులకు బాగానే ఆస్కారం ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం ఉత్త‌మం.

మీన రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారికి ఉద్యోగ వాతావరణం కొంత ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెడ‌తాయి. ఇతరులకు సహాయం చేసే విషయంలో హామీలు ఏ మాత్రం ఇవ్వ‌వ‌ద్దు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కాస్త ఆలోచించి ముందడుగు వేసే అవ‌కాశం ఉంది.

also read :

Whatsapp: వాట్సప్‌లో నయా ఆప్షన్‌.. 15 నిమిషాల్లోపు ఎడిట్‌ చేసుకోవచ్చు..

Andhra Pradesh: అవినాశ్‌ రెడ్డి సీబీఐ విచారణపై ఏపీ ప్రభుత్వం ఏమంటోందంటే..

IAS Success Story: ఆ అలవాట్లే నన్ను ఐఏఎస్ అయ్యేలా చేశాయి..

Spirituality: పూజ తర్వాత హారతి.. ఆంతర్యం ఏమిటో తెలుసా?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News