HomedevotionalToday Horoscope: 15-09-2022 గురువారం రాశి ఫలాలు .. ఈ రాశుల వారికి నేడు అంతా శుభ‌మే..!

Today Horoscope: 15-09-2022 గురువారం రాశి ఫలాలు .. ఈ రాశుల వారికి నేడు అంతా శుభ‌మే..!

Telugu Flash News

Today Horoscope:

మేషం

మేషం రాశి వారు నేడు విశ్వాసంతో ఉంటారు. వ్యాపారుల విష‌యంలో ఈరోజు ఎలాంటి రిస్కులు తీసుకోవద్దు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. 80 శాతం వరకు అదృష్టం మిమ్మ‌ల్ని వ‌రిస్తుంది.

వృషభం

ఈ రాశి వారు నేడు చేయాల్సిన ప్ర‌యాణాల‌ను కాస్త వాయిదా వేసుకుంటే మంచిది. ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా చక్కటి రోజు. మీకు చాలా కాలం నుంచి రావాల్సిన డబ్బులు ఈ రోజు వ‌చ్చే అవకాశం ఉంది. శుభ‌వార్త‌లు వింటారు

మిథునం

-Advertisement-

ప‌రిపూర్ణంగా అన్ని ప‌నులు చేస్తారు. సానుకూల పురోగతి ఉన్న వ్యక్తులతో సంబంధాలు పెంచుకుంటారు. కొందరు మీ వెనుక నుండి మిమ్మల్ని విమర్శించే అవ‌కాశం ఉంది. వారికి దూరంగా ఉండాలి. ఈ రాశి వారు ఎక్కువ సమయం బయటి పనులు, మార్కెటింగ్ సంబంధిత పనుల్లో గడుపుతారు. 95 శాతం వ‌రకు అదృష్టం ల‌భిస్తుంది.

క‌ర్కాట‌కం

ఈ రాశి వారు నేడు బంధువుల‌తో స‌ర‌దాగా గడుపుతారు. పిల్ల‌ల దగ్గ‌ర నుండి శుభ‌వార్త‌లు వింటారు. ప్ర‌త్య‌ర్ధులు ఈ రోజు మీపై కుట్ర‌లు ప‌న్నే అవ‌కాశం ఉంది. అందుకు జాగ్ర‌త్త‌గా ఉండాలి. మీరు ఎంత ప్ర‌శాంతంగా ఉంటే, మీరు అంత రిలాక్స్‌గా ఉంటారు.80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

సింహం

టీమ్ వర్క్ ద్వారానే ప‌నులు చేస్తే ఈ రోజు మీకు మంచి జ‌రుగుతుంది. కొత్త వారితో కూడా మీరు ప‌ని చేయాల్సి వ‌స్తుంది. ప‌ని విష‌యంలో వాద‌న‌లు పోకుండా ఉండాలి. వాదనలు చేయడం ద్వారా మీపైన రోజు అంతా ప్రభావం ఉండే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఈ రాశి వారు కొద్దిగా జాగ్ర‌త్త‌గా ఉండాలి

క‌న్యా రాశి

మీరు ఏకాగ్ర‌త‌తో ప‌ని చేస్తే, ఈ రాశి వారికి నేడు చాలా ప్రయోజనకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం మంచిది. వ్యాపారులకు ఈరోజు మెరుగ్గా ఉంటుంది, దీంతో కుటుంబంతో కలిసి వినోద సమయాన్ని గడుపుతారు. మరోవైపు వాతావరణంలో వచ్చిన మార్పులు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

తులా రాశి

ఈ రాశి వారు చేయ‌బోయే ప‌నుల‌న్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా జ‌రుగుతాయి. విద్యార్థులు ఈరోజు కష్టానికి తగ్గట్టు కొంత ప్ర‌తిఫ‌లం కూడా పొందొచ్చు. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలానే పత్రాలపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదవి సంత‌కం చేయాలి. 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

వృశ్చిక రాశి

ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో శుభకార్యాలు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈరోజు ఎవరైనా ముఖ్యమైన లేదా రాజకీయ నాయకులతో సమావేశలంలో పాల్గొంటారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు మంచిగా ఉంటుంది.

​ధనస్సు రాశి

ఈ రాశి వారు నేడు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. పెట్టుబడికి సంబంధించిన పనులకు సమయం అనుకూలంగా ఉండ‌డంతో మంచి ప‌నులు త‌ల‌పెడతారు . సామాజిక సేవలో నిస్స్వార్థంగా పని చేస్తారు. 92 శాతం వరకు అదృష్టం మిమ్మ‌ల్ని వ‌రిస్తుంది.

​మకర రాశి
ఈ రాశి వారికి ప్రముఖలతో పరిచయాలు ప్రయోజనకరంగా, గౌరవ ప్రదంగా మారే అవ‌కాశం ఉంది. పెండింగులో ఉన్న పనులు చాలా వరకు పూర్తి చేసి హ్యాపీగా ఉంటారు. మీ స్నేహితుల వల్ల కొంత ఇబ్బంది ప‌డే ఛాన్స్ ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు నష్టం జరిగే ఛాన్స్ ఉండ‌గా, జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి

ఈ రాశి వారికి నేడు అన్నీ విజ‌యాలే. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ముందుకు సాగుతారు . ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు పెద్దల సలహాలు పాటించాలి. మీ కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటుంది. మధుమేహం, రక్తపోటు ఉన్నవారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. .

​మీన రాశి

ఈ రాశి వారు కొంత ముఖ్య‌మైన స‌మాచారం గ్ర‌హిస్తారు. పెండింగ్ ప‌నులు పూర్తి చేస్తారు. మీ జీవితంలో కొంద‌రు ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తుల‌ని క‌లుస్తారు. కుటుంబ వాతావ‌రణం చాలా ఆహ్ల‌దంగా ఉంటుంది. 75 శాతం వ‌ర‌కు అదృష్టం ఉంటుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News