HomedevotionalMoney Tips: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం 11 వారాలు ఇలా చేయండి..

Money Tips: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం 11 వారాలు ఇలా చేయండి..

Telugu Flash News

Money Tips: నేటి కాలంలో ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది సతమతం అవుతుంటారు. అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఆర్థిక సమస్యల కారణంగా కొందరికీ జీవితాలు తలకిందులైపోతుంటాయి. ఇలాంటి తరుణంలో లక్ష్మీదేవి కరుణ, కటాక్షాలు తమపై ఉండాలని కోరుకుంటారు. అయితే, ఎంతకష్టపడినా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు మీ చేతుల్లో ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు, ఉపాయాలు పాటించాలి.

ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతూ ఉంటే.. వాస్తు శాస్త్రంలో కొన్ని చక్కటి పరిష్కారాలు సూచించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మట్టి కలశాలతో లక్ష్మి అనుగ్రహం కోసం కొని పరిహారాలు చేసుకొనే వీలుంది. మట్టి కలశ పరిహారాలు జీవితంలో కొన్ని సానుకూల మార్పులను తీసుకొస్తాయని పండితులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం కూడా ఈ పరిహారం మీ ఇంటి ఆర్థిక స్థితిని అన్ని విధాలా మెరుగు పరుస్తుందని చెబుతున్నారు. ఈ నివారణ కోసం ఒక చిన్న మట్టి కుండ తీసుకొని అందులో 1 రూపాయి చొప్పున 5 నాణేలు వేయాలి.

తర్వాత ఈ కలశంలో బియ్యం, గోధుమలు, బార్లీ వంటి ఏదైనా ధాన్యాన్ని తీసుకొని పూర్తిగా నింపాలి. ఒక ఎర్రటి బట్టను తీసుకొని, కలశంపైన కట్టాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలశాన్ని లక్ష్మీ దేవి విగ్రహం లేదా చిత్రపటం దగ్గర ఉంచి నిత్యం పూజించుకోవాలి. రోజంతా ఈ కలశాన్ని లక్ష్మీదేవి దగ్గర ఉంచాలి. మరుసటి రోజు మళ్లీ లక్ష్మిదేవిని పూజించిన తర్వాత అక్కడ నుంచి కలశాన్ని తీసుకుని భద్రంగా, అల్మారాలో లేదా డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో పెట్టాలి.

ఇలా చేసుకోవడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఇక కొబ్బరికాయను లక్ష్మీ నివాసంగా భావిస్తారు. టెంకాయ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతారు. దీని కోసం కొబ్బరికాయను తీసుకొని ఎర్రటి గుడ్డలో చుట్టుకోవాలి. తర్వాత ఈ కొబ్బరికాయను లక్ష్మీదేవి వద్ద ఉంచి పూజ చేయాలి.

అనంతరం సురక్షితమైన ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోయి ఇంట్లో సుఖ శాంతులు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు. అలాగే 11 శుక్రవారాలు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి పసుపు కలిపిన బియ్యంతో పూజ చేయడం వల్ల సంపద లభిస్తుందని పేర్కొంటున్నారు.

Read Also : Devotional: శంఖం సంపదకు ప్రతిరూపం.. ఎలా పూజించాలంటే..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News