ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చేది ఏ పార్టీనో టైమ్స్ నౌ సర్వే (Times Now Survey) వెల్లడించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఆ సర్వే స్పష్టం చేసింది. అది ఎంతలా అంటే ఏకంగా 24 నుంచి 25 ఎంపీ సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడం ఖాయమని సర్వే పేర్కొనడం విశేషం. వైఎస్సార్‌సీపీ హవా 2019లో ఎలా అయితే కొనసాగిందో.. ఇప్పుడు కూడా ఏ మాత్రం వన్నె తగ్గలేదని సర్వే స్పష్టం చేసింది. దీంతో ఏపీలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చినట్లయింది.
ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్ టైమ్స్ నౌ-ఈటీజీ సంయుక్తంగా చేసిన ఈ సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గానూ అన్నీ వైఎస్సార్‌సీపీ క్లీప్ స్వీప్ చేసే అవకాశం ఉందని సర్వలే తేటతెల్లమైంది. మరోవైపు కేంద్రంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందని సర్వేలో తేలింది. వరుసగా మూడోసారి అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని సర్వే తేల్చింది. బీజేపీ కూటమికి 292 నుంచి 338 స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఇక కాంగ్రెస్ కూటమికి 106 నుంచి 144 సీట్లు, ఇతరులకు 66 నుంచి 96 లోక్ సభ సీట్లు వచ్చే చాన్స్ ఉందని తెలిపింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమికి 38.2 శాతం, కాంగ్రెస్ కూటమికి 28.7 శాతం, ఇతరులకు 33.1 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. బీజేపీ ముమ్మాటికీ 300 పైచిలుకు స్థానాలు కైవసం చేసుకుంటుందని సర్వేలో పాల్గొన్న 42 శాతం మంది చెప్పారని, అదే సమయంలో ఈసారి బీజేపీ రావడం కష్టమేనని 26 శాతం మంది చెప్పారని పేర్కొంది. అయితే, ఎన్నికల నాటికే దీనిపై మరింత స్పష్టత వస్తుందని 19 శాతం మంది అభిప్రాయపడ్డారట. 13 శాతం ఏమీ చెప్పలేమన్నారు. మోదీ పాలన రెండో దఫా అత్యంత సంతృప్తికరంగా ఉందని సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది చెప్పడం విశేషం.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీకి పోటీ లేదని సర్వేలో పాల్గొన్న వారు కుండబద్ధలు కొట్టారట. ప్రధాని మోదీ ప్రభుత్వం అతి పెద్ద వైఫల్యం ద్రవ్యోల్బణమని 34 శాతం, నిరుద్యోగమని 46 శాతం మంది పేర్కొన్నారు. నల్లధనాన్ని వెనక్కు తేలేకపోవడమని 13 శాతం, చైనా దూకుడును అడ్డుకోవడంలో వైఫల్యమని 7 శాతం చెప్పారట. ఇండియాలో ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్య్రం ప్రమాదంలో పడ్డాయా? అనే ప్రశ్నకు 41 శాతం మంది లేదని బదులిచ్చారట. ఇక ప్రాంతీయ పార్టీల్లో పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు 20 నుంచి 22 ఎంపీ సీట్లు, ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు 11 నుంచి 13 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది.
also read :
Etala Vs Revanth : కాంగ్రెస్‌కు రూ.25 కోట్ల డబ్బు అందిందన్న ఈటల.. ప్రమాణానికి సిద్ధమన్న రేవంత్