Telugu Flash News

moral stories in telugu : చెప్పుడు మాటలు వింటే చెడిపోతారు జాగ్రత్త !

moral stories in telugu

moral stories in telugu

moral stories in telugu : ఒక అడవిలో నాలుగు ఎడ్లు చాలా స్నేహంగా ఉండేవి. ఒకదాని కొకటి ఎంతో సహాయం చేసుకొనేవి. వాటి స్నేహానికి అవే మురిసిపోయేవి. గర్వపడేవి కూడా. ఆ అడవిలో ఉండే ఒక పులి వీటిని చూసింది. అబ్బా! ఇవి ఎంత బలంగా ఉన్నాయి! ఇంకా నాకు భలే విందు భోజనం. కాని ఇవన్నీ ఎంతో ఐకమత్యంగా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళితే నన్నే కుమ్మి చంపేస్తాయి. ఎట్లా ! అని బాగా ఆలోచించింది. మెదడుకి పదును పెట్టింది. ఓహో!భలే ఆలోచన.

వాటిలో వాటికి పోట్లాట పెట్టి విడగొట్టగలిగితే హయిగా తినవచ్చు. అనుకుని ! ఒక్కొక్క ఎద్దు దగ్గరికి వెళ్ళి మిగతా మూడింటి మీదా చాడీలు చెప్పింది, ఓ ఎద్దన్నా! ఎద్దన్నా!

ఆ మూడు ఎడ్లు నీ స్నేహితులు అనుకుంటున్నావా! కాదు కాదు! గడ్డి అంతా నువ్వే తినేసి బలసి పోతున్నావట. వాటికి కాస్తయినా ఉంచట్లేదుట. స్నేహం అంటే ఇదేనా అని నీ మీద నేరాలు చెప్తుంటే నేను స్వయంగా విన్నాను. అని చెప్పింది. ప్రతి ఎద్దు దగ్గరా ఒపికగా ఇదే పాట పాడింది. ఎద్దన్నలు కాస్త మొద్దన లయ్యాయి. పులి మాటలు నమ్మేశాయి. వాటి గాఢ స్నేహం ‘గాలి బుడగలా’ నీటి బుడగలా’ చిట్లిపోయింది.

మర్నాటి నుంచీ అవి ఒకదాన్నొకటి గుర్రుగా కోపంగా చూసుకోవటం మొదలు పెట్టాయి, వాటి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటం మొదలైంది. విడివిడిగా ఇంకేం! మన పులి పని సులువైపోయింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క తిరగటం మొదలు పెట్టాయి. మనస్సు విరిగితే అతకదు కదా! ఎద్దుని చంపి విందు ఆరగించింది. ఆపదలో ఉన్న ఎద్దు ఎలుగెత్తి అరిచినా మిగతా ఎడ్లు నాకేం అన్నట్లు ఊరుకున్నాయి. పైగా బాగా అయింది అనుకున్నాయి. అలా నాలుగు ఎడ్లు పులి ఉపాయానికి బలి అయి పోయాయి. ప్రాణ స్నేహితులు చెప్పుడు మాటలు విని ప్రాణం మీదకు తెచ్చుకున్నాయి.

నీతి : యదార్థం తెలుసుకోకుండా చెప్పుడు మాటలు, వింటే చెడిపోతారు జాగ్రత్త !

also read :

Acharya Movie Set : చిరంజీవి మూవీ సెట్‌లో అగ్ని ప్ర‌మాదం.. సిగ‌రెట్ వ‌ల్ల‌నే సంభ‌వించిందా..!

Rajamouli : రాజ‌మౌళి మ‌హేష్ బాబు మూవీ తో హాలీవుడ్ కూడా షేక్ కావ‌ల్సిందే…!

 

Exit mobile version