Telugu Flash News

Upasana : ఉపాస‌న డెలివ‌రీ డేట్ వ‌చ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

ram charan upasana

Upasana: మెగా అభిమానులు ఏదైతే రోజు కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారో ఆ రోజు మ‌రెన్నో రోజులు లేదు. ఉపాస‌న డెలివ‌రీ డేట్ ఎప్పుడా ఎప్పుడా అని కొన్నాళ్లుగా చ‌ర్చ‌లు సాగుతుండ‌గా, ఇప్పుడు ఆ డేట్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియగానే చాలామంది చిరంజీవి పుట్టినరోజు నాడే మెగా వారసుడు పుడితే బాగుంటుంది అని ఎన్నో ఆలోచ‌న‌లు చేశారు. చిరంజీవి సైతం ఇదే కోరికను కోరుకున్నార‌ని తెలుస్తుంది . అయితే ఉపాసన డెలివరీ డేట్ ఆగస్టు 20 కి ఇచ్చినట్లు ఓ వార్త వైర‌ల్ అవుతుంది.

రెండు రోజులు ఆగి ఆగస్టు 22న పుడితే మాత్రం తాత మనవడు ఒకేరోజు పుట్టినరోజు జ‌రుపుకుంటారుగా అని అనుకుంటున్నారు.

ఎప్పుడైతే మెగా కోడలు ఉపాసన ప్ర‌గ్నెంట్ అని తెలియ‌జేసిందో అప్ప‌టి నుండి ఆమెకు సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఓ సారి సరోగసి ద్వారా బిడ్డకు జన్మనివ్వబోతుందని.. మరోసారి కవల పిల్లలు అని.. ఇలా అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి.

ఇక ఇటీవ‌ల ఆమె డెలివరీ అమెరికాలో జరగబోతుంది అంటూ కూడా గాసిప్ లు హ‌ల్‌చ‌ల్ చేశాయి.. అయితే అదంతా ఫేక్ అంటూ తన డెలివరి ఇండియాలోనే జరగబోతుంది.. అది కూడా అపోలో హాస్పిటల్స్ లోనే జరుగుతుంది అంటూ ఉపాస‌న పుకార్ల‌కి చెక్ పెట్టింది.

also read :

Anasuya Latest Saree Stills, Images, Photos 2023

Eggshells : గుడ్డుతో పాటు పెంకులు తిన్నా ఆరోగ్యమే!

Shriya Saran You And I Magazine Photoshoot Photos 2023

 

Exit mobile version