Taraka Ratna: మంచి టాలెంట్ ఉన్న నందమూరి హీరో తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో చివరికి ఫిబ్రవరి 18న కన్నుమూసారు. జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. అదేరోజు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మెరుగైన చికిత్స కోసం తారకరత్నని హుటాహుటిన నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించి కొద్ది రోజులుగా అక్కడే చికిత్స అందిస్తున్నారు.
తారకరత్నని బ్రతికించాలని శాయశక్తులా ప్రయత్నించిన కూడా విఫలం అవ్వడానికి కారణం మొదటి రోజు చేసిన తప్పే కారణమా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికి సీపీఆర్ అనేది నిమిషాల్లోనే చేయాలి. కానీ.. తారకరత్న విషయంలో దాదాపు 45 నిమిషాల పాటు ఆలస్యం చేశారు.
సీపీఆర్ అందాల్సిన టైంలో అందకుండా పోయే సరికి హార్ట్ హొల్స్ లో బ్లడ్ క్లోట్ అయిపోయి.. బ్రెయిన్ కి సప్లై ఆగిపోవడం వల్లే తారకరత్న పరిస్థితి విషమంగా మారిందని కొందరు చెప్పుకొస్తున్నారు.
సరైన టైంలో సీపీఆర్ చేసి ఉంటే.. తారకరత్నని మనం కాపాడుకునే వాళ్లమని సన్నిహితులు చెబుతున్న మాట. ఏదేమైన చిన్న వయస్సులో తారకరత్న మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
also read :
Taraka Ratna Passed Away : నందమూరి తారక రత్న కన్నుమూత
Viral Video : మల్లెపూలతో ఎంత సక్కగున్నవే తెల్ల పిల్లా..!