HomecinemaJai Balayya: అస‌లు జై బాల‌య్య స్లోగ‌న్ ఎక్క‌డ‌, ఎప్పుడు పుట్టింది..దాని వెనక స్టోరీ ఇదే..!

Jai Balayya: అస‌లు జై బాల‌య్య స్లోగ‌న్ ఎక్క‌డ‌, ఎప్పుడు పుట్టింది..దాని వెనక స్టోరీ ఇదే..!

Telugu Flash News

Jai Balayya: విశ్వవిఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు వారసుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ ఎన్నో అద్భుత‌మైన సినిమాలుచేసి తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు. ఏ జాన‌ర్‌లో అయిన ఇట్టే ఒదిగిపోయి న‌టించ‌డం బాల‌య్య స్టైల్‌.

ఆరు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు, ప‌లు షోస్ చేస్తూ త‌న అభిమానుల‌ని అల‌రిస్తున్నాడు.ఈ క్ర‌మంలోనే ఈ మ‌ధ్య ఎక్కడ చూసినా చాలా ఎక్కువగా వినిపిస్తోన్న నినాదం జై బాల‌య్య‌. సెలబ్రేషన్‌తో సంబంధం లేకుండా ఏ కార్యక్రమంలోనైనా ఈ నినాదం వినిపిస్తుంది.. గోవిందా గోవిందా అన్నట్టుగా.. ఎవరైనా ‘జై బాలయ్య’ అనగానే అక్కడున్నవారు అనుకోకుండానే ‘జై బాలయ్య’ అనేస్తున్నారు.

ఇది దీని వెన‌క కార‌ణం

మ‌రి ఈ స్లోగన్ అంతలా జనాల్లోకి వెళ్లిపోయింది. అయితే, ఇటీవ‌ల ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలోనూ ‘జై బాలయ్య’ స్లోగన్స్ వినబడ్డాయి.

ఇండియా-పాక్ మ్యాచ్ చూసేందుకు తెలుగువారంతా మెల్‌బోర్న్ మెట్రో రైలులో మ్యాచ్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో మెట్రో రైలులో జై బాలయ్య నినాదాలు అందుకున్నారు. ‘‘జై బాలయ్య బోలేతో సిక్సర్ మారేగా’’ అంటూ కిక్ ఎక్కించారు. జై బాలయ్య అని చెప్తే సిక్సర్ వెళ్లిపోతుందట. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గ‌త యేడాది కాలంలో ఎక్క‌డ చూసినా తెలుగు జ‌నాలు, తెలుగు సినీ ప్రేమికుల నోట జై బాల‌య్యా స్లోగ‌న్ తెగ మార్మోగుతోంది. అస‌లు అఖండ సినిమాకు ముందు నుంచే.. ఇంకా చెప్పాలంటే అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 1 ఎనౌన్స్ అయిన‌ప్ప‌టి నుంచి ఊపందుకున్న ఈ స్లోగ‌న్ ఇప్పుడు పీక్స్ కి వెళ్లింది.

అస‌లు బాల‌య్య ప్రోగ్రామ్స్‌, బాల‌య్య సినిమాలు ఆడుతోన్న థియేట‌ర్ల‌లోనే కాదు.. ఏ థియేట‌ర్లో అయినా.. అది సింగిల్ స్క్రీనా, మ‌ల్టీఫ్లెక్సా అవ‌స‌రం లేదు.. క్లాస్, మాస్ తేడా లేకుండా చివ‌ర‌కు ఏ హీరో సినిమా చూస్తున్నా కూడా ఆ ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా జై బాల‌య్య నినాదాల‌తో హోరెత్తిపోయేలా చేస్తున్నారు.

-Advertisement-

అస‌లు ఈ స్లోగ‌న్ పుట్టింది బాల‌య్య న‌టించిన లారీ డ్రైవ‌ర్ త‌ర్వాత‌నే అని తెలుస్తుంది. ఆ సినిమాలో బాల‌య్య పేరుతో బాల‌య్య బాల‌య్య అన్న సాంగ్ రాశారు. ఈ సాంగ్ హిట్ అయిన త‌ర్వాత జై బాల‌య్య నినాదం కొన్నాళ్లు బాగా పాపుల‌ర్ కాగా, మ‌ళ్లీ స‌మ‌ర‌సింహారెడ్డి సినిమా టైంలో ఈ స్లోగ‌న్‌కు బాగా ఊపు వ‌చ్చింది. ఇక మ‌ధ్య‌లో కాస్త స్లో అయినా ఇప్పుడు మాత్రం నంద‌మూరి అభిమానులు మాత్ర‌మే కాదు ప్ర‌తి ఒక్క‌రు కూడా జై బాల‌య్య అంటూ హోరెత్తించేస్తున్నారు.

also read news:

T20 World cup: వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌డం క‌ష్టమేనా.. విజేతను ఎలా తేలుస్తారు..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News