Telugu Flash News

Agent : వింత వాద‌న‌.. లైగ‌ర్, ఏజెంట్ చిత్రాలు ఫ్లాప్ కావ‌డానికి కార‌ణాలు ఇవేన‌ట‌…!

AGENT

AGENT

Agent : ఇటీవ‌లి కాలంలో యువ హీరోల నుండి వ‌చ్చిన రెండు భారీ ప్రాజెక్ట్స్ లైగ‌ర్, ఏజెంట్‌.. ఈ రెండు చిత్రాల‌పై అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకోగా, అవి చాలా నిరాశ‌ప‌రిచాయి. కథ, కథనం లేకుండా కేవలం యాక్షన్, హీరోయిజాన్ని నమ్ముకుని సినిమాలు చేస్తే ఆడవని ఈ రెండు చిత్రాలు మ‌రోసారి రుజువు చేశాయి.

లైగర్… విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ వ‌ల‌న ఓపెనింగ్స్ పరంగా కొంచెం పర్లేదు కాని ఏజెంట్ కి అవి కూడా రాలేదు. అయితే ఏజెంట్, లైగర్ ఫ్లాప్ కావడానికి ఒక రీజన్ ఉంని కొత్త ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి.. కథ, కథనాలు పక్కన పెడితే ఓ బ్యాడ్ సెంటిమెంట్ వాటిని వెంటాడింద‌ని చెప్పుకొస్తున్నారు . మ‌రి ఆ సెంటిమెంట్ ఏంటంటే…

liger

‘సాలా’ అనే హిందీ పదం. ఈ రెండు చిత్రాల్లో సాలా అనే పదం ఉపయోగించ‌డం వ‌లన నెగిటివ్ రిజల్ట్ వచ్చింద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. సాలా అంటే బామ్మర్ది అని అర్థం. ఇది చాలా మందికి ఊతపదం కూడా. మాస్ అప్పీల్ గా ఉంటుంది. ఈ సాలా అనే పదం విజయ్ దేవరకొండ, అఖిల్ కి కలిసిరాలేదని, అందుకే వారి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయని కొంద‌రు లెక్క‌లు వేసి చెబుతున్నారు.

also read :

Horoscope (01-05-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Qualcomm : క్వాల్‌కమ్‌లోనూ ఉద్యోగాల కోతలు.. చిప్‌ మేకింగ్‌లో అగ్రగామికి తప్పని కష్టాలు!

Exit mobile version