Bellamkonda Suresh : ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారు చోరీకి గురైంది. బెల్లంకొండ సురేష్ కారు అద్దాలు దొంగలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు . అతని కారులోంచి నగదు, ఖరీదైన మద్యం బాటిళ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. గురువారం మధ్యాహ్నం జర్నలిస్టు కాలనీలోని తన కార్యాలయం ముందు సురేష్ తన కారును పార్క్ చేశాడు. శుక్రవారం ఉదయం కారు ఎడమవైపు సీటు అద్దాలు పగులగొట్టారు. కారులో 50 వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలు కనిపించలేదు. ఒక్కొక్క మద్యం సీసా ధర 28,000 రూపాయలు అని సమాచారం. ఇలా జరగడం తో నిర్మాత బెల్లంకొండ సురేష్ కార్యాలయ సిబ్బంది పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
read more :
Robbery : దొంగతనానికి వచ్చి.. ఛార్జింగ్ పెట్టి.. ఫోన్ మర్చిపోయిన దొంగ 📱
arvind kejriwal : గుజరాత్ హైకోర్టుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్🧐
Bhagavanth Kesari Teaser : 👌తెలంగాణ యాసలో అదరగొట్టిన బాలయ్య😎.. ‘భగవంత్ కేసరి’ టీజర్ సూపర్బ్..