HomecinemaMahesh Babu: మ‌హేష్ ఇంట్లో చోరికి య‌త్నం.. బొక్క‌బోర్లాప‌డ్డ దొంగ‌

Mahesh Babu: మ‌హేష్ ఇంట్లో చోరికి య‌త్నం.. బొక్క‌బోర్లాప‌డ్డ దొంగ‌

Telugu Flash News

Mahesh Babu: సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ బాబు ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయ‌న చేసే ప్ర‌తి సినిమాపై అభిమానుల‌లో అంచ‌నాలు భారీగా ఉంటాయి.

ఇటీవ‌ల స‌ర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు ఇప్పుడు త్రివిక్ర‌మ్ తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తైన త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో రూపొంద‌నుండ‌గా, ఇందులో హాలీవుడ్ స్టార్స్ కూడా భాగం కాబోతున్న‌ట్టు తెలుస్తుంది.

దొంగ దొరికాడు..

మంగ‌ళ‌వారం మహేష్ బాబుఇంట్లోకి దొంగ చొర‌బ‌డే య‌త్నం చేశాడు. మహేష్ బాబు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 81 లో నివాసం ఉంటున్నారు. మహేష్ ఇంటికి కన్నం వేస్తే భారీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో చాకచక్యంగా కరెంట్ ఫెన్సింగ్ ఉన్న ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించే ప్ర‌య‌త్నం చేశాడు దొంగ‌. గోడ అయితే ఎక్కి దూకాడు కానీ అది బాగా ఎత్తుగా ఉండడం వ‌ల‌న కింద ప‌డి తీవ్ర గాయాల పాలయ్యాడు.

అయితే పెద్ద ఎత్తున శ‌బ్ధం రావ‌డంతో సెక్యూరిటీ గార్డులు శబ్దం వచ్చిన వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక వ్యక్తి గాయాలతో పడి ఉన్న వ్య‌క్తిని గ‌మనించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించ‌గా, హుటాహుటిన, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని విచారించి హాస్పిటల్ కి తరలించారు. కోలుకున్న త‌ర్వాత పూర్తి వివ‌రాలు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు.

ఇక సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేష్‌ తల్లి ఇందిరాదేవి(70) నిన్న వేకువ‌జామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం వేకువజామున హైదరాబాద్‌లోని ఇంట్లో క‌న్నుమూశారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News