Telugu Flash News

Cancer Causing Foods: ఈ 7 ఆహారాలు క్యాన్సర్ కారకాలు

cancer causing foods

క్యాన్సర్ అనే పదం వింటేనే చాలామందికి వణుకు పుడుతుంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమందిని బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి. అయితే ఈ క్యాన్సర్ కారక ఆహారాలు (Cancer Causing Foods) కొన్ని మనం ప్రతిరోజూ తీసుకుంటున్నవే అందుకే అటువంటి ఆహారాలపట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పడమే ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

ఈ క్యాన్సర్ కణాల యొక్క పెరుగుదల శరీరంలో ఎక్కడైనా జరగొచ్చు. అయితే కొన్ని రకాల ఆహారాల వల్ల కొన్ని శరీర భాగాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ప్రారంభ దశల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వ్యాధి తీవ్రమయ్యి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది.

క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండండి.. ఈ క్యాన్సర్ కారక ఆహారాలు (Cancer Causing Foods) మానేయండి

  1. మైదా, చాలా ఇళ్లలో సాధారణంగా ఉపయోగించే ప్రమాదకరమైన ఆహార పదార్ధం. ఇది మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఈ పదార్ధం తయారు చేయబడినప్పుడు, దీనిలో చాలా క్లోరిన్ వాయువులు కలుస్తాయి, ఇందులో గ్లైసెమిక్ ఇండెస్ కూడా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగే అవకాశం ఉంది.
  2. పాప్ కార్న్ గురించి తెలియని వారు ఎవరుంటారు ? అయితే ‘మైక్రోవేవ్ ఓవెన్ పాప్ కార్న్ బ్యాగ్‌’ లలో తయారు చేసినప్పుడు, ఈ ఆరోగ్యకరమైన పాప్ కార్న్ లు మర్డర్ ఏజెంట్‌లలో ఒకటిగా నిరూపించబడిన perfluorooctanoic acid గా మారగలవని మీకు తెలుసా? ఇది కలిగించే కొన్ని క్యాన్సర్లు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కిడ్నీ, కాలేయం మరియు మూత్రాశయం క్యాన్సర్లు.
  3. ఆల్కహాల్ అధిక మొత్తంలో తాగినప్పుడు మీ కాలేయం దెబ్బతింటుందని అందరికి తెలుసు అయితే దానివల్ల కాన్సర్ వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా?  అయితే ఈ అలవాటు వల్ల కేవలం కాలేయానికే కాదు కిడ్నీ, రెక్టమ్ క్యాన్సర్లు వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది.
  4. బంగాళదుంప చిప్స్.. ఇవి  మన రోజువారీ చిరు తిండ్లలో ఒకటైన  ఆహారం. ఇవి కూడా మీకు హానికరం ఎందుకో తెలుసా? బంగాళాదుంప చిప్స్ యాక్రిలామైడ్‌తో ప్యాక్ చేయబడి ఉంటాయి, అధిక ఉష్ణోగ్రత వీటిని వండుతారు ఈ రసాయనం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
  5. ప్రాసెస్డ్ ఫుడ్స్ : ప్రాసెస్ చేసిన మరియు నిల్వ చేసిన  ఆహారాన్ని తీసుకోవడం మానేయండి.  వాటిలో నైట్రేట్స్ మరియు నైట్రిట్స్ ఉంటాయి అంతే కాదు ఇటువంటి ఆహారంలో ట్రాన్స్ ఫాట్ ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.
  6. సోడాలు, క్యాన్ లో ఉండే ఆహార పదార్ధాలు తీసుకోకపోవడమే మంచిది. వీటిలో చక్కర ఎక్కువ ఉండి క్యాన్సర్ కణాలను రెట్టింపు సంఖ్యలో పెంచుతుంది.
  7. నిల్వ పచ్చళ్ళు మనం నిత్యం తింటూ ఉంటాము. ఎక్కువగా తింటే అవి కూడా ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా? వీటివల్ల జీర్ణాశయం దెబ్బతిని పేగు, కొలోన్ క్యాన్సర్లు వంటివి వచ్చే అవకాశం ఉంది.

 

ఇవి కూడా చదవండి :

‘కాంతారా’ పై చిలుకూరు అర్చకులు రంగరాజన్ గారి ట్వీట్ వైరల్

viral video: పాండా ప్ర‌య‌త్నం విఫ‌లం.. బొక్క‌బోర్లా ప‌డిందిగా..!

 

Exit mobile version