క్యాన్సర్ అనే పదం వింటేనే చాలామందికి వణుకు పుడుతుంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమందిని బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి. అయితే ఈ క్యాన్సర్ కారక ఆహారాలు (Cancer Causing Foods) కొన్ని మనం ప్రతిరోజూ తీసుకుంటున్నవే అందుకే అటువంటి ఆహారాలపట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పడమే ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
ఈ క్యాన్సర్ కణాల యొక్క పెరుగుదల శరీరంలో ఎక్కడైనా జరగొచ్చు. అయితే కొన్ని రకాల ఆహారాల వల్ల కొన్ని శరీర భాగాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ప్రారంభ దశల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వ్యాధి తీవ్రమయ్యి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది.
క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండండి.. ఈ క్యాన్సర్ కారక ఆహారాలు (Cancer Causing Foods) మానేయండి
- మైదా, చాలా ఇళ్లలో సాధారణంగా ఉపయోగించే ప్రమాదకరమైన ఆహార పదార్ధం. ఇది మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఈ పదార్ధం తయారు చేయబడినప్పుడు, దీనిలో చాలా క్లోరిన్ వాయువులు కలుస్తాయి, ఇందులో గ్లైసెమిక్ ఇండెస్ కూడా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగే అవకాశం ఉంది.
- పాప్ కార్న్ గురించి తెలియని వారు ఎవరుంటారు ? అయితే ‘మైక్రోవేవ్ ఓవెన్ పాప్ కార్న్ బ్యాగ్’ లలో తయారు చేసినప్పుడు, ఈ ఆరోగ్యకరమైన పాప్ కార్న్ లు మర్డర్ ఏజెంట్‌లలో ఒకటిగా నిరూపించబడిన perfluorooctanoic acid గా మారగలవని మీకు తెలుసా? ఇది కలిగించే కొన్ని క్యాన్సర్లు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కిడ్నీ, కాలేయం మరియు మూత్రాశయం క్యాన్సర్లు.
- ఆల్కహాల్ అధిక మొత్తంలో తాగినప్పుడు మీ కాలేయం దెబ్బతింటుందని అందరికి తెలుసు అయితే దానివల్ల కాన్సర్ వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా? అయితే ఈ అలవాటు వల్ల కేవలం కాలేయానికే కాదు కిడ్నీ, రెక్టమ్ క్యాన్సర్లు వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది.
- బంగాళదుంప చిప్స్.. ఇవి మన రోజువారీ చిరు తిండ్లలో ఒకటైన ఆహారం. ఇవి కూడా మీకు హానికరం ఎందుకో తెలుసా? బంగాళాదుంప చిప్స్ యాక్రిలామైడ్‌తో ప్యాక్ చేయబడి ఉంటాయి, అధిక ఉష్ణోగ్రత వీటిని వండుతారు ఈ రసాయనం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
- ప్రాసెస్డ్ ఫుడ్స్ : ప్రాసెస్ చేసిన మరియు నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకోవడం మానేయండి. వాటిలో నైట్రేట్స్ మరియు నైట్రిట్స్ ఉంటాయి అంతే కాదు ఇటువంటి ఆహారంలో ట్రాన్స్ ఫాట్ ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.
- సోడాలు, క్యాన్ లో ఉండే ఆహార పదార్ధాలు తీసుకోకపోవడమే మంచిది. వీటిలో చక్కర ఎక్కువ ఉండి క్యాన్సర్ కణాలను రెట్టింపు సంఖ్యలో పెంచుతుంది.
- నిల్వ పచ్చళ్ళు మనం నిత్యం తింటూ ఉంటాము. ఎక్కువగా తింటే అవి కూడా ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా? వీటివల్ల జీర్ణాశయం దెబ్బతిని పేగు, కొలోన్ క్యాన్సర్లు వంటివి వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
‘కాంతారా’ పై చిలుకూరు అర్చకులు రంగరాజన్ గారి ట్వీట్ వైరల్
viral video: పాండా ప్రయత్నం విఫలం.. బొక్కబోర్లా పడిందిగా..!