Telugu Flash News

High blood pressure : ఈ 4 జ్యూస్‌లు తాగితే అధిక రక్తపోటును అడ్డుకోవచ్చు!

these juices control high blood pressure

చాలా మంది హై బీపీ (High blood pressure) తో బాధపడుతుంటారు. జీవన శైలి, ఆహారంలో మార్పుల వల్ల రక్తపోటులో హెచ్చతగ్గులు సంభవిస్తుంటాయి. నేటి కాలంలో బీపీ సమస్యలు చాలా మందికి కామన్‌గా మారాయి. బీపీ వల్ల గుండె జబ్బులకూ దారి తీస్తుంది. మధుమేహం, మూత్రపిండ సమస్యలకూ బీపీ కారణమయ్యే చాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. వర్క్‌ ప్రెజర్‌ కూడా బీపీ రావడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా హై బీపీని నివారించాలంటే కొన్ని పండ్ల రసాలు తీసుకోవాలి. తాజా పండ్లతో తయారు చేసిన జ్యూసులు తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

  1. కొబ్బరి నీరు తీసుకుంటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. బీవీతో బాధపడే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది.

2. బీట్‌రూట్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల విటమిన్లు, క్యాల్షియం, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

3. దానిమ్మ రసం తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులతో పోరాడే సామర్థ్యం వస్తుంది.

4. రోజూ ఓ గ్లాసు టమాటా రసం తీసుకుంటే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. టమాటాల్లో విటమిన్లు, క్యాల్షియం, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి తోడ్పడుతుంది.

also read news: 

Pawan Kalyan:  ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురిగా బన్నీ కూతురా.. ఏ సినిమాలో ?

Tarakaratna: తార‌క‌ర‌త్న ల‌వ్ స్టోరీ సినిమాని త‌ల‌పించేలా ఉందిగా..!

 

Exit mobile version