H-1B Visa News : అగ్రరాజ్యం అమెరికాలో ఓవైపు ఆర్థిక మాంద్యం కారణంగా పెద్ద ఎత్తున కంపెనీలన్నీ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మార్చి ఒకటో తేదీ నుంచి హెచ్1బీ వీసీ దరఖాస్తులు ఆహ్వానిస్తూ అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కీలక ప్రకటన చేసింది. దీంతో స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు ఢోకా లేదని మరోసారి స్పష్టమైందని టెక్ దిగ్గజ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మాంద్యం ఎఫెక్ట్‌తో తాజాగా గూగుల్ 12 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇదే దారిలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, హెచ్‌పీ, ట్విట్టర్ తదితర సంస్థలన్నీ వేలాదిగా ఉద్యోగులను ఇంటికి పంపాయి. హెచ్1బీ వీసాలు కలిగిన వారంతా ప్రస్తుతం మరో కొలువు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం 60 రోజుల్లోనే కొత్త ఉద్యోగంలో చేరకపోతే ఇక సొంత దేశానికి వెళ్లిపోవాల్సి ఉండటంతో వీరి కష్టాలు వర్ణనాతీతం అయ్యాయి.
తాజాగా మాంద్యం ఎఫెక్ట్ ఎంత ఉన్నా సరే.. స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు డోకా లేదని స్పష్టం చేస్తూ మార్చి ఒకటో తేదీ నుంచి 17వ తేదీ వరకు 2024 హెచ్1బీ వీసా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు USCIS ప్రకటించింది. ప్రొఫెషనల్స్ తమ అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో హెచ్1బీ రిజిస్టేషన్ విధానంలో సమర్పించాలని కోరింది. దరఖాస్తుదారులు విడివిడిగా మైయూఎస్‌సీఐఎస్ (myUSCIS) ఆన్‌లైన్ ఖాతాను వినియోగించాలని వెల్లడించింది.
దరఖాస్తు దారుడు 10 డాలర్ల ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఫిబ్రవరి 21 నుంచి యూఎస్ ఎంప్లాయర్స్, ఏజెంట్లు కొత్త ఖాతాలు క్రియేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే, సింగిల్ ఆన్‌లైన్ సెషన్‌లో ఒకటికంటే ఎక్కువ మంది లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లను వారి ప్రతినిధులు సమర్పించాల్సి ఉంటుంది.
గడువులోగా సరిపడా రిజిస్ట్రేషన్లు వస్తే వారి పేర్లను USCIS ఎంపిక చేసి myUSCIS ఆన్‌లైన్ ఖాతా ద్వారా సెలక్షన్ నోటిఫికేషన్లను పంపుతుంది. అలా కాని పక్షంలో ఆరంభ రిజిస్ట్రేషన్ పీరియడ్‌లో సమర్పించిన దరఖాస్తులను మార్చి 31వ తేదీ వరకు నోటిఫై చేస్తామని USCIS పేర్కొంది.
also read news:
జార్ఖండ్‌లో నడిరోడ్డుపై చేపల వాహనం బోల్తా.. పోలీసుల చేతివాటం.. పైగా లంచం డిమాండ్!
Tarakaratna : ఇట్స్ మిరాకిల్.. తారకరత్న విషయంలో అద్భుతం జరిగిందన్న బాలకృష్ణ