ఆయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించబడిన శ్రీరాముడి విగ్రహం నేడు ఘనంగా ఆవిష్కరించబడింది. ఈ అపూర్వ దృశ్యం భక్తుల కనుల పండువైంది. శ్రీరాముడిని ఐదు సంవత్సరాల బాలరూపంలో నిలుచున్న భంగిమలో, చేతిలో బంగారు విల్లు, బాణాన్ని పట్టుకున్న స్వరూపంలో ఈ విగ్రహం రూపొందించబడింది.
అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడు
ప్రజల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతం అయ్యింది.#RamMandirPranPrathistha #AyodhaRamMandir pic.twitter.com/hoeT9oiOqd
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2024
Jai Shri Ram 🚩#RamLallaVirajman ❤️ pic.twitter.com/nzVLxmv5fk
— Ankita (@AnkitaBnsl) January 22, 2024
Goosebumps🔥🔥🔥
Don’t call yourself a Hindu if you can’t get goosebumps after श्री राम darshan at Ayodhya Ram Mandir!
Jai Shree Ram 🚩#RamMandirPranPrathistha
#RamLallaVirajman #JaiShreeRam 🙏🙏🙏 pic.twitter.com/F75SQGleEg— Ram 🚩🚩🚩 (@ram1039117) January 22, 2024
Will never forget this moment for the rest of my life. #RamLallaVirajman #JaiShreeRam 🙏 pic.twitter.com/MZwRjs2nM3
— Vertigo_Warrior (@VertigoWarrior) January 22, 2024
మైసూరుకు చెందిన కళాకారుడు అరుణ్ యోగిరాజ్ మలచిన ఈ 51 అంగుళాల ‘రామ లల్ల’ విగ్రహం నల్లటి రాతితో తయారు చేయబడింది. ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు, మందిర నిర్వాహకులు రెండు రోజుల పాటు విగ్రహాన్ని క్రమంగా ఆవిష్కరించారు. గురువారం రోజున విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచే సమయంలో దానిపై ఓ వస్త్రాన్ని కప్పి ఛాయాచిత్రాలు విడుదల చేశారు. నేడు ఉదయం మరో చిత్రం వెలుగులోకి వచ్చింది, అందులో కేవలం విగ్రహం కళ్లపైనే గుడ్డ వేసి ఉంది. మధ్యాహ్న సమయానికి పూర్తి రూపాన్ని చివరగా ఆవిష్కరించారు, దీనిలో దేవతామూర్తి ముఖం, బంగారు విల్లు, బాణాలు స్పష్టంగా కనిపించాయి.