Telugu Flash News

The elephant whisperers: ఆస్కార్ తెప్పించిన ఏనుగులు మాయం.. ఏం జ‌రిగిందంటూ అంద‌రిలో చ‌ర్చ‌

The elephant whisperers: 95వ అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా తమిళ డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో రఘు, అమ్ము అనే రెండు ఏనుగులు నటించ‌గా, వాటి నేప‌థ్యంలో రూపొందిన డాక్యుమెంట‌రీ ఆస్కార్ అవార్డ్ సాధించ‌డం ప‌ట్ల చిత్ర బృందం హ‌ర్షం వ్య‌క్తం చేసింది.

అయితే ఆ ఏనుగులు అదృశ్యమయ్యాయని ఏనుగుల సంరక్షకుడు బొమ్మన్ తెలియ‌జేశారు. మద్యం మత్తులో ఉన్న కొంతమంది వ్యక్తులను తరుముకుంటూ అవి అడవిలోకి వెళ్లిపోయాయని ఆయ‌న తెలియ‌జేశారు.


also read : Anti-Aging Foods : మగాళ్లూ.. నిత్య యవ్వనంగా కనిపించాలా? అయితే ఇవి తినండి..

Sreemukhi Latest Hot Photos, Images, Stills, pictures 2023


బొమ్మన్ ఆ ఏనుగుల కోసం క్రిష్ణగిరి అడవుల్లో గాలిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎలాగైనా ఆ ఏనుగుల ఆచూకీ తెలుసుకుంటానని.. ఒకవేళ అవి కనిపించకపోతే మా ఊరు వెళ్లిపోతానని బొమ్మన్ తెలియ‌జేశాడు. రెండు అనాథ ఏనుగు పిల్లల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన బొమ్మన్, బెల్లి అనే దక్షిణాది దంపతుల ప్రయాణం నేప‌థ్యంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ రూపొందించారు.

ఏనుగులకు, మనుషులకు మధ్య ఉండే సంబంధం.. అలానే వారి పనులు కాలక్రమేణా ప్రకృతికి ఎలా దోహదపడ్డాయి అనే అంశాలు ఈ లఘుచిత్రంలో మ‌న‌కు సాక్షాత్క‌రిస్తాయి.

Exit mobile version