HomecinemaGame Changer : మ‌ళ్లీ అడ్డంగా దొరికిన థ‌మ‌న్.. టైటిల్ బీజీఎం కూడా కాపీ చేశావా..!

Game Changer : మ‌ళ్లీ అడ్డంగా దొరికిన థ‌మ‌న్.. టైటిల్ బీజీఎం కూడా కాపీ చేశావా..!

Telugu Flash News

Game Changer BGM COPY : చాలా త‌క్కువ స‌మ‌యంలో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎదిగిన థ‌మ‌న్ ఇప్పుడు అన్నీపెద్ద సినిమాల‌కే ప‌ని చేస్తున్నాడు. ఆయ‌న తాజాగా శంక‌ర్- రామ్ చ‌ర‌ణ్ కాంబోలో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రంకి ప‌ని చేస్తున్నాడు.

అయితే థ‌మ‌న్ ఆయన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కొట్టారంటే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే అని `అఖండ`, `వీరసింహారెడ్డి` చిత్రాలు చూశాక అంద‌రికి అర్ధ‌మైంది. అయితే రామ్ చ‌ర‌ణ్ `గేమ్‌ ఛేంజర్ కి ఎలాంటి బీజీఎం అందిస్తాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌క్ర‌మంలో పెద్ద షాక్ ఇచ్చింది.

`గేమ్‌ ఛేంజర్‌` బీజీఎం కాపీ అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఓ హిందీ ఒరిజినల్‌ సాంగ్‌కి కాపీ అని ట్రోల‌ర్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ యోయో హనీ సింగ్‌, ఊర్వసి రౌతేలా కలిసి చేసిన `లవ్‌ డోస్‌`(టూ ఆజ్‌ మెరీ క్లోజ్‌) సాంగ్‌ని పోలి రామ్ చ‌ర‌ణ్ సినిమా సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్ బీజీఎం ఉందంటున్నారు.

అయితే హనీ సింగ్‌ మ్యూజిక్‌ కాస్త స్మూత్‌గా వెళితే, థమన్‌ దాని డోస్‌ పెంచాడని, డబుల్‌ డోస్‌ ఇచ్చి ఈ కొత్త బీజీఎం చేశాడని కంపేర్ చేస్తూ ప‌లు ర‌కాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. లవ్‌ డోస్‌ సాంగ్‌ తొమ్మిదేళ్ల క్రితం రాగా, దానిని అంద‌రు మ‌ర‌చిపోయిన నేప‌థ్యంలో దానిని థ‌మ‌న్ లేపేసాడ‌ని చెబుతున్నారు.

ALSO READ :

-Advertisement-

Sreemukhi Latest Hot Photos, Images, Stills, pictures 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News