Telugu Flash News

Thalapathy Vijay : దళపతి విజయ్ సంచలన నిర్ణయం.. సినిమాలకు కొన్నాళ్లు విరామం!

thalapathy vijay

thalapathy vijay

Thalapathy Vijay : విజయ్ సినిమా అంటే ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మాస్టర్, వారసుడు తర్వాత తెలుగులోనూ మార్కెట్‌ సంపాదించుకున్నాడు. ఇప్పుడు లియో సినిమా మార్కెట్ ఏకంగా 22 కోట్లు అంటే తెలుగులో అతడి రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత సినిమాల పై ఆసక్తి కూడా పెరిగింది.

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో సినిమాతో బిజీగా ఉన్న విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. కస్టడీ పెద్ద డిజాస్టర్ అయినా విజయ్ తన కథను నమ్మి ఓ అడుగు ముందుకేసాడు. లియో తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. లియో సినిమా అక్టోబర్ 19 2023 న విడుదల కానుంది.

దసరా సెలవులను టార్గెట్ చేస్తూ విజయ్ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఇండస్ట్రీ అంతటా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా సరిగ్గా వర్క్ అవుట్ అయితే 1000 కోట్ల సినిమా అవుతుందని విజయ్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే వెంకట్ ప్రభు సినిమా తర్వాత విజయ్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి మూడేళ్లు విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. తమిళనాడులో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ ఇప్పటి నుంచే ప్లాన్స్ వేస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో విజయ్ ఏ పార్టీకి ఓటు వేయాలో తన అభిమానులకు చెప్పాడు.

ఆయన చెప్పిన పార్టీకి ఓటు వేస్తే.. అది అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో విజయ్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో రాజకీయ పార్టీలు కూడా ఆయన మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆయన ఒక్కరే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే రేంజ్ లో మాత్రం పరోక్షంగా తన అభిమానులను ప్రభావితం చేస్తున్నాడు.

దీంతో వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేయాలని విజయ్ భావిస్తున్నాడు. అందుకే సినిమాలకు కొన్నాళ్లు విరామం తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. అందుకే అంగీకరించిన సినిమాలను త్వరగా పూర్తి చేయాలని విజయ్ భావిస్తున్నాడు. ఇదే నిజమైతే తమిళనాడులో ఇంతకంటే పెద్ద సంచలనం మరొకటి ఉండదు. ఈ సంవత్సరం లియో మూవీ వస్తుంది.

వెంకట్ ప్రభు సినిమాను 2024 సంక్రాంతి కి విడుదల చేయాలని చూస్తున్న విజయ్.. అందుకు తగ్గట్టుగానే డేట్స్ కూడా సర్దుబాటు చేస్తున్నాడు. విజయ్ తదుపరి చిత్రాన్ని 2027లోనే చేయాలని చూస్తున్నాడు. ఇదే నిజమైతే అతని కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ బ్రేక్ అవుతుంది. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లోనూ ఇది సంచలనం కానుంది.

ఇవి కూడా చదవండి :

kidnap : నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు.. కిడ్నాప్ ను చేధించిన పోలీసులు.. చిన్నారి సురక్షితం

dengue cases : కేరళలో పెరుగుతున్న టైప్ 2 డెంగ్యూ కేసులు; 4 రోజుల్లో 5 గురు మృతి

Exit mobile version