టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పార్టీకి అనుకూలంగా కూడగట్టడంలో భాగంగా ఆయన పాదయాత్ర చేస్తున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో తాజాగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా ఎన్.ఆర్.పేట ఎన్టీఆర్ సర్కిల్లో సభ తలపెట్టిన లోకేష్‌కు.. పోలీసులు అనుమతి లేదని చెప్పారు. లోకేష్‌ను అడ్డుకున్నారు. జీవో నంబర్ వన్ ప్రకారం రహదారులపై సమావేశాలు పెట్టడానికి వీల్లేదని చెప్పారు.
ఈ పరిణామంతో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పోలీసులపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఎన్టీఆర్ సెంటర్‌లో ప్రజల వద్దకు వెళ్లి లోకేష్ మాట్లాడారు. సభ నిర్వహణకు అనుమతించకపోతే ఎలా? అని లోకేష్ ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో సభ నిర్వహించుకోవాలా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు లోకేష్. ఈ నేపథ్యంలోనే లోకేష్ మైకును తీసుకొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన లోకేష్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి మాటల్లో తడబాటుకు గురవుతున్నారు. లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నిబంధనల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ఇక లోకేష్ సంయమనం కోల్పోయి మాట్లాడుతుండడంతో వైసీపీ నేతలు కూడా తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
పాదయాత్రలో లోకేష్.. జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మోసానికి మారుపేరు జగన్ అని లోకేష్ చెప్పారు. ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఢిల్లీకి తాకట్టుపెట్టారని లోకేష్ ఆరోపించారు. ఖాళీగా ఉన్న రెండు లక్షలా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏమైందని ప్రశ్నించారు. ఏటా ఆరున్నర వెయ్యి కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి అడిగితే సమాధానం లేదన్నారు. ఇలా పలు సభల్లో ఆయన జగన్‌పై విమర్శలతో అటాక్ చేస్తున్నారు.
also read :
KA Paul On Revanth Reddy : టెర్రరిస్టులా రేవంత్ వ్యాఖ్యలు.. వెంటనే అరెస్టు చేయాలి..
Viral Video : కమలా హ్యారిస్ భర్తకు జిల్ బైడెన్ లిప్ కిస్..