Telugu Flash News

telangana weather alert | హెచ్చరిక! తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు

weather report

weather report

telangana weather alert | వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

 

Exit mobile version