Telugu Flash News

Trains Cancelled : వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. ఏయే రైళ్ళంటే ?

trains cancelled

Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభావం పడింది. హసన్‌పర్తి-కాజీపేట రైల్వే ట్రాక్‌పై భారీగా వరద నీరు చేరింది. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు.

వర్షాల కారణంగా రైళ్ల రద్దు వివరాలను దక్షిణ మధ్య రైల్వే తాజాగా వెల్లడించింది. ఇప్పటికే మూడు రైళ్లు పూర్తిగా, నాలుగు రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. వీటితో పాటు 9 రైళ్లను దారి మళ్లించారు. ఇందులో సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ (17233), సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (17234) రైళ్లను రద్దు చేశారు.

పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్ల జాబితాలో తిరుపతి – కరీంనగర్ (12761), కరీంనగర్ – తిరుపతి (12762), సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ (12757), సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ (12758) పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. ఇంకో రెండు రోజులు వర్షాలు ఇలానే కురిస్తే మరి కొన్ని రైళ్లు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా వెల్లడించింది.

దూర ప్రాంతాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనివార్య పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే తగిన ఏర్పాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం. రైల్వే అధికారులు అందించే సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

also read :

viral video : షూటింగ్‌ చూడ్డానికి వచ్చిన చిరుత.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?

Prabhas : ఇండియాకు వచ్చిన ప్రభాస్.. 3 సినిమాలు సెట్స్‌పైనే.. ప్లాన్ ఏంటి ?

 

Exit mobile version