Telugu Flash News

Sujana Chowdary: సుజనా చౌదరికి ఝలక్.. మెడికల్‌ కాలేజీ అనుమతులు రద్దు!

Sujana Chowdary: బీజేపీ మాజీ ఎంపీ సుజనా చౌదరికి జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ ఝలక్‌ ఇచ్చింది. హైదరాబాద్‌లోని సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్‌ కాలేజీ గుర్తింపును ఎన్‌ఎంసీ రద్దు చేసింది. 2023-24 అడ్మిషన్లు నిలిపివేయాలని ఎన్ఎంసీ ఆదేశాలు ఇచ్చింది.

మెడిసిటీ మెడికల్ కాళాశాల హైదరాబాద్ శివారులో కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆస్పత్రిని కూడా నిర్వహించాల్సి ఉంది. ఇటీవలి కాలంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం కాలేజీ నిర్వహించడం లేదన్న కంప్లయింట్స్ భారీగా వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో లోపాలు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విద్యా సంవత్సరానికి మెడికల్ సీట్లను భర్తీ చేయకుండా నిషేధం విధించింది.

రాష్ట్ర విభజన అనంతరం వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోకి వెళ్లింది. ప్రతి విద్యా సంవత్సరంలో మొత్తంగా 150 సీట్ల భర్తీకి వీలుంది. 2002 నుంచి 2017 వరకు ప్రతి విద్యా సంవత్సరంలో 100 సీట్లను భర్తీ చేసేందుకు అనుమతి ఉంది.

తాజాగా ఈ ఇన్‌స్టిట్యూట్ గుర్తింపును రద్దు చేసినట్లు ఎంసీఐ ప్రకటించినట్లు సమాచారం. నేషనల్ కౌన్సిల్ యాక్ట్- 2019లోని 26 క్లాజ్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Read Also : MLA Raghunandan Rao: రఘునందన్‌రావుకు లీగల్‌ నోటీసు.. వెయ్యికోట్ల పరువు నష్టం దావా!

Exit mobile version