Telugu Flash News

Telangana News : ఈ రోజు కూడా విద్యాసంస్థలకు సెలవు

today weather report

Telangana News : తెలంగాణలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు శనివారం సెలవు అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గురు, శుక్రవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం కూడా సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు శుక్ర, శనివారాల్లో సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version