Telangana News : బస్సులు నడిపే డ్రైవర్లకు చాలా మంది ఇటీవల గుండెపోటు రావడం వార్తల్లో చూస్తున్నాం. అయితే, ఇలా గుండెపోటు వచ్చిన సందర్భాల్లో కొందరు తమతోపాటు చాలా మంది ప్రయాణికుల ప్రాణాలను తీస్తుంటారు. మరికొందరు మాత్రం ప్రయాణికుల్ని కాపాడి తాము ప్రాణాలను కోల్పోతుంటారు. ఆ కోవలో చాలా ఘటనలు జరిగాయి. తాజాగా ఇలాంటిదే ఇప్పుడు తెలంగాణలో ఓ ఘటన వెలుగు చూసింది. బస్సులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు కు గురయ్యాడు డ్రైవర్. కానీ, ప్రయాణికులను మాత్రం కాపాడి తాను అనంత లోకాలకు వెళ్లిపోయాడు.
ఈ విషాద ఘటన తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో చోటు చేసుకుంది. ఆఖరి ఘడియల్లోనూ డ్రైవర్ బస్సులో ప్రయాణిస్తున్న వారికోసమే తపన పడి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా వారిని కాపాడా తాను మృత్యు ఒడికి చేరాడు. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అంకన్నగూడెం-సుందరయ్య కాలనీ మధ్యలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
బస్సు రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అక్కడిక్కడే ఆయన మృతి చెందాడు. అయితే, తాను చనిపోతున్నా.. ఎదురుగా వస్తున్న లారీలను తప్పించి.. బస్సులో ఉన్న 45 మందిని కాపాడాడు ఆ డ్రైవర్. ఇది చూసిన ప్రత్యక్ష సాక్షులు అయ్యో పాపం అంటూ డ్రైవర్‌కు నివాళులు అర్పించారు. అయితే, ఈ ఘటనలో చనిపోయింది తమిళనాడుకు చెందిన డ్రైవర్‌గా గుర్తించారు.
తమను కాపాడి మృత్యు ఒడికి చేరాడు..
చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం ఉత్తర బ్రాహ్మణపల్లికి చెందిన 45 మంది తమిళనాడులో తీర్థ యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం భద్రాచలంలో సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. భద్రాచలం-వెంకటాపురం మార్గంలో యాదాద్రికి బయల్దేరారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లా పొన్నై గ్రామానికి చెందిన డ్రైవర్ దేవాయిరక్కం (57) గుండెలో మంట అని చెప్పి కొద్ది సేపు బస్సును ఆపి మరలా ముందుకు పోనిచ్చాడు. ఇదే సమయంలో గుండెపోటు వచ్చేసింది. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. తాను కూర్చున్న సీటులోనే డ్రైవర్ కుప్పకూలి మృతి చెందాడు. యాత్రికులెవరికీ గాయాలు కూడా కాలేదు. తమ ప్రాణాల్ని కాపాడి డ్రైవర్ మృత్యు ఒడికి చేరాడని ప్రయాణికులు కన్నీటిపర్యంతమయ్యారు.
also read:
Viral Video : క్యాన్సర్ రోగుల కోసం పెళ్లి కూతురు ఏం చేసిందో చూడండి.. మనసులు గెలిచింది!