Teja: విలక్షణ దర్శకడు తేజ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. జయం సినిమాతో మంచి హిట్ కొట్టిన తేజ ఆ తర్వాత నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు తేజ. ముక్కుసూటి మాటలతో ఆకట్టుకునే తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన అనేక విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తను చాలా ఎమోషనల్ పర్సన్ అని చెప్పిన తేజ, కొంచెం హర్ట్ అయిన, ఫీలయిన కూడా సినిమా మీద ఏ మాత్రం ఫోకస్ పెట్టలేను. సినిమా మధ్యలో డిస్ కనెక్ట్ అయిపోయి అవతలి వారికి ఏం కావాలో ఫస్ట్ అదే తీసి ఇచ్చేస్తాను.ఒకసారి నేను అలా డిస్కనెక్ట్ అయితే ఇంక అనుకున్నది తీయలేను, సినిమాని వదిలేయడం తప్ప అని తేజ చెప్పుకొచ్చాడు.
చాలా మంది నాకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అని అంటూ ఉంటారు. అయితే వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోను. అలాంటప్పుడు నా గురించి ఎవరేమనుకుంటున్నారో అనేది నేను ఎంందుకు తెలుసుకోవాలి అని తేజ అన్నారు. ఈ రోజు మీరు నన్ను తిట్టేసి మళ్లీ రేపు ఇంటర్వ్యూకి పిలిస్తే నేను తప్పక వస్తానేమో. ఎందుకంటే అవి నాకు పెద్దగా గుర్తు ఉండదు. ఐతే, నేను నా హిట్స్ కంటే ఫ్లాపులను ఎక్కువగా నా మైండ్‌లో గుర్తు పెట్టుకుంటాను.
అలాగే నేను చేసిన తప్పులను .. నేను పొందిన అవమానాలను కూడా జీవితంలో అస్సలు మరిచిపోలేను అని తేజ స్పష్టం చేశారు. తేజ సినిమాలు అన్నీ ఒకేలా ఉంటాయనే అంటుంటారు. మ్యూజిక్‌గానీ, కథలు ట్రావెలింగ్‌గానీ ఓ సెపరేట్ ఫ్లో ఉంటుందని చెబుతుంటారు. మరి దీనిపై మీ స్పందన ఏంటని అడగగా, దానికి తేజ స్పందిస్తూ .. నేను నాలా తీస్తాను , అందుకే సేమ్ ఒకే టైపు ఉంటాయని, అన్ని సినిమాలకు నేనే డైరెక్టర్ ని కాబట్టి కచ్చితంగా సిమిలారిటీస్ ఉంటుందని స్పష్టం చేశారు.
సినిమాని రాసింది, తీసింది తానే అయినప్పుడు తప్పక దగ్గర పోలికలు ఉంటాయని తేజ అన్నాడు. తాను మాత్రమే కాదు, ఏ డైరెక్టర్ సినిమాలైనా దాదాపు ఒకేలా ఉంటాయని, అలాగే రాజమౌళి సినిమాలన్నీ కూడా ఒకేలా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.. ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే సినిమాలన్నీ ఒకే ప్యాట్రన్‌లో వెళుతుండడం మనం గమనించవచ్చు. రాజమౌళి మాత్రమే కాదు, మహేంద్రన్, గౌతమ్ మీనన్ సినిమాలు కూడా దాదాపు అలానే ఉంటాయని తేజ స్పష్టం చేశారు.
ఇండస్ట్రీలో ఇంటలిజెంట్స్ డైరెక్టర్స్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ అనే విషయం గురించి చెప్పిన తేజ.. ఇంటిలిజెంట్ డైరెక్టర్స్ లో తేజ, సుకుమార్, రాజమౌళి, బోయపాటి, వినాయక్ వంటి వారు లేరని అన్నాడు. వీరంతా కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అని అన్నాడు. ఇక్కడ ఇంటిలిజెంట్ అనేది కాదు, అన్నింటిని దాటుకుని ఓ మ్యాజిక్ జరుగుతుంది. అలా జరిగినప్పుడు సక్సెస్‌లు వస్తాయని తేజ స్పష్టం చేశారు. తేజ తెరకెక్కించిన అహింసా చిత్రం జూన్ 2న విడుదల కానుంది.
read more news :
Hansika: ఆ టాలీవుడ్ హీరో తనని వేధించాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హన్సిక!