Homeviral newsViral Video: ఇది చూస్తే ట్రైన్‌లో మ‌ళ్లీ టీ తాగ‌రేమో.. ఇంత దారుణ‌మా?

Viral Video: ఇది చూస్తే ట్రైన్‌లో మ‌ళ్లీ టీ తాగ‌రేమో.. ఇంత దారుణ‌మా?

Telugu Flash News

Viral Video: రైలు ప్ర‌యాణం చేసేట‌ప్పుడు బోగీల‌లో టీతో పాటు ప‌లు తినుబండార‌లు అమ్ముతుండ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. అయితే వేడి వేడి చాయ్ అని అరుస్తూ, ఇంట్రెస్ట్ లేని వారికి కూడా టీ తాగే లా చేస్తుంటాయి ఆ అరుపులు. అయితే ఆ స‌మ‌యంలో బాబు ఇలా రామ్మా! అంటూ టీ తీసుకొని ఠక్కున ఒక కప్పు లాగించేస్తారు. ఇప్పటివరకు ఇది బాగానే ఉన్నా.. ఈ వార్త చదివాక మరోసారి అలాంటి సాహసం చేయ‌రు. ఎందుకంటే.. రైలు ప్రయాణాల్లో అమ్మే చాయ్ ఇలా వేడిచేస్తారంటూ ఒక ప్రయాణికుడు.. చాయ్ వేడి చేసే విధానాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా, ఇది చూసి ప్ర‌తి ఒక్క‌రు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇది పాత వీడియో అయిన ప్ర‌స్తుతం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. రైలులో టీ అమ్మే వ్యక్తి అపరిశుభ్రమైన ఇనుప రాడ్‌ను (హీటర్‌)‌ను ఉపయోగించి టీ వేడి చేస్తూ క‌నిపించాడు. దీనిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా, వైరల్‌గా మారింది. “శబరి ఎక్స్‌ప్రెస్ రైలు అధ్వానంగా ఉంది. అందులో ఇస్తున్న ఫుడ్, టీల నుంచి ప్రయాణికులు సురక్షితంగా ఉండండి” అని క్యాప్షన్ పెట్టి.. ఆ వీడియోని నె్ట్టింట‌ షేర్ చేశారు. దీని బట్టి ఆ వీడియో శబరి ట్రైన్‌లో తీసినట్టు తెలుస్తుంది. అది చూసిన వారంతా అవాక్క‌వుతున్నారు . అందులో మరీ ఇంత దారుణమైన పరిస్థితి ఉందా..? అని భావిస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన కూడా చెందుతున్నారు.

డ‌బ్బులు తీసుకొని మ‌రీ మ‌న జీవితాల‌తో ఆడుకుంటున్నారు అని కొంద‌రు మండిప‌డుతున్నారు. వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎనిమిది లక్షలకుపైగా వ్యూస్ రాగా, ఆ వీడియోను చూసినవారంతా అసహ్యించుకుంటున్నారు. ఇలాంటి వాటిపై అధికారులు త‌క్ష‌ణ‌మే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొంద‌రు కామెంట్స్ చేస్తూ.. తాము ఫుడ్ పార్శిల్ చేయడం చూశామని, అప్పటి నుంచి ట్రైన్‌లో తినకూడదని నిర్ణయించుకున్నామని వ్యాఖ్యానించారు. మరొక యూజర్.. ఇంత అపరిశుభ్రంగా చేసే వ్యక్తులను క‌ఠినంగా శిక్షించాల‌ని కామెంట్ పెట్టారు. అలాగే రైల్వే స్టేషన్‌లలో దొరికే ఆహారాల నాణ్యత, శుభ్రత గురించి రైల్వే సిబ్బంది కొంత దృష్టి పెట్టాల‌ని కోరుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ꧁VISHAL༆ (@cruise_x_vk)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News