HomebusinessMoonlighting : మూన్‌లైటింగ్ విషయంలో ఉద్యోగులపై సానుభూతి చూపాలంటోన్న టీసీఎస్

Moonlighting : మూన్‌లైటింగ్ విషయంలో ఉద్యోగులపై సానుభూతి చూపాలంటోన్న టీసీఎస్

Telugu Flash News

మూన్‌లైటింగ్ (Moonlighting) వంటి సమస్యతో వ్యవహరించేటప్పుడు ఆలోచించడం చాలా ముఖ్యం, దానికి వ్యతిరేకంగా తీసుకునే చర్య ఒక వ్యక్తి కెరీర్‌ను నాశనం చేస్తుంది, అన్నారు TCS COO N గణపతి సుబ్రమణ్యం .

మూన్ లైటింగ్ అంటే

అర్ధమయ్యే విధంగా వివరించాలంటే, మూన్ లైటింగ్ అనేది ఉద్యోగులు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలలో పని చేయడాన్ని సూచిస్తుంది.

మూన్‌లైటింగ్ అనేది “నైతిక సమస్య” అని మరియు కంపెనీ విలువలకు విరుద్ధమని చెప్పిన కొన్ని రోజుల తర్వాత TCS COO ఈ వ్యాఖ్యలు చేశారు.

మూన్ లైటింగ్ (Moonlighting) పై చర్యలు

“దేశంలోని అతిపెద్ద IT services exporter అయిన TCS మూన్‌లైటింగ్ విషయంలో సాక్ష్యాలు ఉన్నప్పుడు ఉద్యోగులపై చర్య తీసుకోకుండా ఏదీ ఆపలేదు, అయినప్పటికీ ఉద్యోగులు వేరే ఇతర కంపెనీ కోసం పనిచేయడానికి మేము అంగీకరించలేము ” అని టిసిఎస్ ఉన్నతాధికారి తెలిపారు.

ఆ అధికారి ఇంకా వివరిస్తూ, “చర్యలు తీసుకోవడం వల్ల ఆ ఉద్యోగి కెరీర్ నాశనం అవుతుంది. తర్వాత భవిష్యత్ ఉద్యోగానికి సంబంధించిన బాక్గ్రౌండ్ చెక్ లో ఈ చర్య వారికి సమస్యగా మారుతుంది… అందుకే కొంత సానుభూతి చూపాలి.”

6.16 లక్షల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ, ఒక సిబ్బందిని కుటుంబ సభ్యులుగా  చూస్తుందని సుబ్రమణ్యం చెప్పారు. ఏదైనా చర్య తీసుకున్నప్పుడు దాని యొక్క పర్యవసానాలు, కుటుంబ సభ్యులపై ప్రభావం చూపిస్తుంది.

-Advertisement-

సర్వీస్ కాంట్రాక్ట్‌లో భాగంగా ఒక ఉద్యోగి మరే ఇతర సంస్థలోనూ పని చేయకుండా నిషేధించబడ్డారని TCS చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ పేర్కొన్నారు.

కొన్ని IT సంస్థలు ఫ్రీలాన్సర్‌లతో కలిసి  పనిచేస్తాయని, అయితే TCS వంటి అగ్రశ్రేణి సంస్థలు మూన్‌లైటింగ్ వంటి కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతించదని  తెలిపారు.

పరిష్కారం ఏంటి ?

ఎంట్రీ-లెవల్ ఉద్యోగులకు వేతన ప్యాకేజీలు చాలా సంవత్సరాలుగా ఒకే స్థాయిలో ఉండటం గురించి అడిగినప్పుడు, సుబ్రమణ్యం మాట్లాడుతూ, ఫ్రెషర్స్ కి  ఈ ఆదాయం సరిపోతుందని మరియు కొన్ని పరీక్షలు క్లియర్ చేయడం ద్వారా వారి ఆదాయాన్ని ఒక సంవత్సరంలో రెట్టింపు చేసుకునే అవకాశం ఉందని అన్నారు..

ఒక ఉద్యోగిని తీసుకున్న తర్వాత, కంపెనీ ఆరు నెలలకు పైగా శిక్షణలో పెట్టుబడి పెడుతుంది మరియు చివరికి ఉద్యోగిని ప్రాజెక్ట్‌లో ఉంచుతుంది. గత కొన్నేళ్లుగా 20-30 శాతం మంది ఉద్యోగులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని, వేతనాలను రెట్టింపు చేయడంలో విజయం సాధించారని ఆయన తెలిపారు.

సుబ్రమణ్యం , ఈ సమస్యను వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH)తో ముడిపెట్టారు, ఒక ఉద్యోగి కార్యాలయంలో ఉంటె చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చని సూచించారు.

ఒక ఉద్యోగి కార్యాలయంలో లభించే మెంటర్‌షిప్ నుండి నేర్చుకోగలడు మరియు ఇంటి నుండి పని చేస్తున్నప్పుడు సాధ్యం కాని అధిక స్థాయి నైపుణ్యాలను కార్యాలయంలో నేర్చుకోవచ్చని అభిప్రాయ పడ్డారు.

సిబ్బంది నుండి ప్రతిఘటన ఉందా అని అడిగినప్పుడు, చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం ‘వెయిట్ అండ్ వాచ్’ మోడ్‌లో ఉన్నారని, కంపెనీ వారిని తిరిగి కార్యాలయాలకు వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తోందని, మరికొందరు ఇంటి నుండి పని చేయడానికి అలవాటు పడ్డారని మరియు దానిలో మార్పుని స్వీకరించలేకపోతున్నారని చెప్పారు.

టెక్ మహీంద్రా, స్విగ్గీ వంటి కొన్ని ఈ ఆలోచనకు మద్దతు ఇస్తుండగా, IBM, Wipro వంటి ఇతర కంపెనీలు దీని గురించి ఆందోళన వ్యక్తం చేశాయి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News