fruits with benefits : పండ్లు ఆరోగ్యాన్ని,అందాన్ని ఇస్తాయి. మరి ఏ పండ్లతో ఏ మేలు కలుగుతుందో చూద్దామా..
- అరటిపండు (banana) శరీరానికి శక్తిని, చర్మానికి బిగువును, రక్తహీనతతో బాధపడేవారికి ఉపశమనాన్ని, విరోచనాల (అరటి +ఉప్పు + చింతపండు) నివారణకు, మలబద్దకాన్ని (అరటి +పాలు) పొగొట్టడానికి పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు.
- నేరేడు పండు (jamun fruit) శరీరానికి చల్లదనాన్నిస్తుంది. కడుపునొప్పిని పోగొడుతుంది. ఈ గింజల పొడిని మజ్జిగలో కలిపి త్రాగితే విరోచనాలు తగ్గుతాయి. ఈ పండ్లను ఉప్పులోగానీ, తేనెలోగానీ ప్రతిరోజూ తీసుకుంటే మూలశంక వ్యాధి రాదు.
- కిస్మిస్ (raisins) పిల్లలలో ఎదుగుదలను, మంచి రంగు చేకూర్చటమే కాకుండా యూరిన్లో రాళ్ళు చేరకుండా కాపాడుతుంది. వీటిని నీళ్ళలో ఉడకబెట్టి ఆ నీటిని త్రాగితే రక్తం శుభ్రపడి బలం వస్తుంది. సంతానం లేనివారు ఈ పండ్లు తింటే ఫలితం ఉంటుంది.
- యాపిల్ (apple) సంపూర్ణ ఆరోగ్యం, రక్తం అభివృద్ధి, సరైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇందులో ఎ, సి విటమిన్లు ఉండటం వలన గుండె, మెదడుకు చాలా మంచిది. ఔషధ శక్తిగల పెప్పిన్ ఉండటం వలన శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. పళ్ళను కూడా శుభ్రపరుస్తుంది.
- మామిడి (mango) రసం దాహతాపాన్ని తీరుస్తుంది.
- బొప్పాయి (popaya) పాలను పులిపిరికాయ ఉన్న చోట ప్రతిరోజూ రాస్తే కొన్ని రోజులకు అవి ఎండి రాలిపోతాయి.
- నిమ్మ (lemon) రసం శరీరానికి శక్తిని, మెరుపును (పంచదార నీళ్ళు నిమ్మరసానికి కలిపి తీసుకుంటే) దాహతాపాన్ని పోగొట్టడం (గ్లాసుడు నీళ్ళు +నిమ్మరసం+ఉప్పు) రక్తాన్ని శుభ్రపర్చడం, అజీర్తి తగ్గించటం, ఆకలి పెరగటానికి (అల్లం+నిమ్మరసం+రాతి ఉప్పు) ఉపయోగ పడుతుంది.
- అనాస (Pineapple) జీర్ణశక్తిని పెంచటం, మలబద్దకం నివారణకు, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారి మూత్రంలో రాళ్ళు కరిగించటానికి మొలలు, జలుబు, గొంతునొప్పి నివారణకు ఇది బాగా పని చేస్తుంది.
- సీతాఫలం (custard apple) లో విటమిన్ బి,సిలు ఉంటాయి. దీనిని ఔషధ ఫలంగా చెప్పుకోవచ్చు. ఏ వయసువారికైనా ఈ పళ్ళు త్వరగా జీర్ణమవుతాయి.
- తాటి ముంజలు (palm fruit) రుచికి బాగుండటమేకాక ఆరోగ్యాన్నిస్తాయి. ముంజెల్లో నీరు శరీరంలోని వేడిని ఉపశమనాన్నిస్తుంది. వేసవి దాహతాపానికి ఇది సరైన మందు.
రోజూ పండ్లను మీ డైలీ మెనూలో చేర్చటం మరిచిపోరుగా !
మరిన్ని ఆరోగ్యకరమైన వార్తలు చదవండి :
Weight loss :మీరు నాజూగ్గా కనబడాలనుకుంటున్నారా? ఇలా చేస్తే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు..
Nutrition tips : ఆరోగ్య పరిపుష్టికి పాటించాల్సిన అద్భుతమైన చిట్కాలు..!